Test Cricket: సెంచరీ చేయకుండానే.. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు ఆటగాళ్లు..
టెస్టు క్రికెట్ విషయానికి వస్తే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, జాక్వెస్ కలిస్, జస్టిన్ లాంగర్, వసీం జాఫర్, సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాళ్ల పేర్లు గుర్తుకు వస్తాయి. ఈ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లో ఎన్నో విజయాలు సాధించారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాళ్లు కూడా టెస్టు క్రికెట్‌లో ఎన్నో సెంచరీలు సాధించారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. అయితే, టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేయకుండానే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లు కూడా ఉన్నారు.
Test Cricket: టెస్ట్ క్రికెట్ ఏ బ్యాట్స్‌మెన్‌కైనా సహనాన్ని పరీక్షిస్తుంది. టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే బ్యాట్స్‌మెన్ చాలా ఓపికతో ఆడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు, టెస్టు క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లు చాలా మంది ఉన్నారు. ఈ బ్యాట్స్‌మెన్ చాలా మంది గొప్ప బౌలర్ల ముందు పరుగులు సాధించారు. వారి బంతులను చాలా బాగా ఆడారు.
టెస్ట్ క్రికెట్‌ని నిజమైన క్రికెట్ అంటారు. ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్ మెన్ గంటల తరబడి క్రీజులో ఉండి, తమ బ్యాట్ నుంచి పరుగులు రాబట్టకపోయినా, బంతిని వదులుతూ డిఫెండ్ చేసే కళ వారికి తెలియాలి. మీకు ఈ కళ లేకపోతే టెస్టు క్రికెట్‌లో రాణించలేరు.
టెస్టు క్రికెట్ విషయానికి వస్తే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, జాక్వెస్ కలిస్, జస్టిన్ లాంగర్, వసీం జాఫర్, సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాళ్ల పేర్లు గుర్తుకు వస్తాయి. ఈ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లో ఎన్నో విజయాలు సాధించారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాళ్లు కూడా టెస్టు క్రికెట్‌లో ఎన్నో సెంచరీలు సాధించారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. అయితే, టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేయకుండానే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లు కూడా ఉన్నారు.
ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన టెస్ట్ క్రికెట్‌లోని టాప్ 3 బ్యాట్స్‌మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
3. చేతన్ చౌహాన్- భారతదేశం..
ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు చేతన్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచాడు. చేతన్ చౌహాన్ కూడా ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేయగలడు. అతను 1969 నుంచి 1981 వరకు తన కెరీర్‌లో మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. రెండుసార్లు నాటౌట్‌గా ఉండి 2084 పరుగులు చేశాడు. తన టెస్టు కెరీర్‌లో చేతన్ చౌహాన్ 16 హాఫ్ సెంచరీలు సాధించాడు. కానీ, సెంచరీ చేయలేకపోయాడు.
ఒకసారి అతను సెంచరీకి చాలా దగ్గరగా వచ్చాడు. కానీ, 97 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇది అతని టెస్టు కెరీర్‌లో అత్యధిక స్కోరు కూడా.
2. నిరోషన్ డిక్వెల్లా (శ్రీలంక)..
ఈ జాబితాలో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నిరోషన్ డిక్వెల్లా రెండో స్థానంలో నిలిచాడు. అతను తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 53 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 94 ఇన్నింగ్స్‌లలో 31.60 సగటుతో 2750 పరుగులు చేశాడు. డిక్వెల్లా తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క టెస్టు సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 96 పరుగులు అయినప్పటికీ అతను తన మొదటి సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు.
1. షేన్ వార్న్..
టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ నిలిచాడు. షేన్ వార్న్ అతని కాలపు దిగ్గజ బౌలర్, ఆ సమయంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ఉన్నందున, అతనికి బ్యాటింగ్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి.
అయినప్పటికీ, షేన్ వార్న్ 145 మ్యాచ్‌లలో 199 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని పొందాడు. అయితే, ఈ కాలంలో అతను ఎప్పుడూ సెంచరీ చేయలేకపోయాడు. వార్న్ తన టెస్టు కెరీర్‌లో 3154 పరుగులు చేసి 12 అర్ధ సెంచరీలు చేశాడు. షేన్ వార్నర్ తన టెస్టు కెరీర్‌లో కేవలం 1 పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. అతని అత్యధిక టెస్టు స్కోరు 99 పరుగులు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..