Pakistan: బాబర్, రిజ్వాన్, అఫ్రిదిలకు ఊహించని షాక్.. పాక్ త్రిమూర్తల కెరీర్‌కు చెక్ పెట్టేసిన సెలెక్టర్లు?
Pakistan Cricket: పాకిస్తాన్ జట్టు జులై-ఆగస్టులో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చే వారం జట్టును ప్రకటించవచ్చు. బాబర్, రిజ్వాన్, అఫ్రిదిలు ఆకిబ్ జావేద్, అలీమ్ దార్, అజార్ అలీ, అసద్ షఫీక్‌లతో సహా పాకిస్తాన్ సెలెక్టర్ల ప్రణాళికలకు దూరంగా ఉన్నారు.

Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్ గ్రాఫ్ ఏడాదికేడాది పడిపోతున్నట్లు కనిపిస్తోంది. మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది వంటి స్టార్ పేయర్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆటగాళ్లకు మరో షాక్ తగిలింది. ముగ్గురి టీ20 కెరీర్ ప్రమాదంలో పడింది. ఎందుకంటే సెలెక్టర్లు ఈ ముగ్గురినీ ఈ ఫార్మాట్ నుంచి దూరం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ఈ ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలోనూ ఆధిపత్యం చెలాయించారు. కానీ, జట్టు పరిస్థితి ఈ ముగ్గురిపై కీలక ప్రశ్నలను లేవనెత్తింది.
జట్టును వచ్చే వారం ప్రకటించవచ్చు..
పాకిస్తాన్ జట్టు జులై-ఆగస్టులో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చే వారం జట్టును ప్రకటించవచ్చు. బాబర్, రిజ్వాన్, అఫ్రిదిలు ఆకిబ్ జావేద్, అలీమ్ దార్, అజార్ అలీ, అసద్ షఫీక్‌లతో సహా పాకిస్తాన్ సెలెక్టర్ల ప్రణాళికలకు దూరంగా ఉన్నారు. రాబోయే టీ20 సిరీస్‌కు వారు అవసరం లేదని సెలెక్టర్లు, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ ఇప్పటికే బాబర్, రిజ్వాన్, షాహీన్‌లకు చెప్పారు.
కొత్త సీజన్ వైపు పయనం..
పీటీఐ నివేదిక ప్రకారం, ముగ్గురూ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త సీజన్‌కు సిద్ధం కావాలని సూచించినట్లు తెలిపారు. జులై చివరి వారంలో పాకిస్తాన్ వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. అక్కడ మూడు టీ20ఐలు, 3 వన్డేలు ఆడవలసి ఉంటుంది. కరేబియన్‌లో ఆడిన తర్వాత, పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌కు వెళుతుంది. అయితే ఆగస్టులో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు మార్చాలని సూచించారు.
ముగ్గురిపై ఫోకస్..
రాబోయే సిరీస్‌లో టీ20 జట్టులో కొత్త యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ప్యానెల్, హెస్సన్ కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘పరిస్థితులు చెయి దాటితే, సెలెక్టర్లు ఏ క్షణమైనా బాబర్, రిజ్వాన్, షాహీన్‌లను తిరిగి ఎంచుకోవచ్చు’ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








