Asia Cup 2025: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియా కప్ నుంచి 8మంది ఔట్.. ఎవరెవరంటే?
Team India Players Injured Before Asia Cup 2025: నాల్గవ టెస్ట్‌లో రిషబ్ పంత్ రూపంలో భారత్ అతిపెద్ద ఎదురుదెబ్బను చవిచూసింది. లార్డ్స్ తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన తర్వాత అతను తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ, మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గాయపడ్డాడు.

Team India Players Injured Before Asia Cup 2025: ఆసియా కప్ 2025 నుంచి టీం ఇండియా ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు భారత ఆటగాళ్లు గాయపడుతున్నారు. ఈ ట్రెండ్ ఆగడం లేదు. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ మాంచెస్టర్ చెస్ట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ మోకాలి గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి మొత్తం సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్‌లు గతంలో కూడా గాయపడ్డారు. ఈ సమయంలో, డజన్ల కొద్దీ భారత ఆటగాళ్ళు గాయపడ్డారు. ఈ నివేదికలో టీం ఇండియా గాయపడిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లాండ్ పర్యటన భారత ఆటగాళ్లకు గాయాలకు అడ్డగా మారిందిగా..
2025 ఆసియా కప్‌నకు ముందు, టీం ఇండియా ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇక్కడి పరిస్థితులు భారతదేశానికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపై గాయపడకుండా రక్షించుకోవడం చాలా పెద్ద పని.
ఎంత జాగ్రత్తగా ఉన్నా.. భారత జట్టులో ఒకరు లేదా ఇద్దరు కాదు, నలుగురు ఆటగాళ్ళు గాయపడ్డారు. ఈ సిరీస్ భారత ఆటగాళ్లకు గాయాల కాలంగా మారినట్లు కనిపిస్తోంది.
గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో అన్షుల్ కాంబోజ్ ను జట్టులోకి తీసుకున్నారు. నాల్గవ టెస్ట్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో అర్ష్ దీప్ సింగ్ గాయపడ్డాడు. మాంచెస్టర్ టెస్ట్‌కు దూరం కావాల్సి వచ్చింది. లార్డ్స్ టెస్ట్ నుంచి ఆకాశ్‌దీప్ గాయపడ్డాడు.
రిషబ్ పంత్ రూపంలో భారీ ఎదురుదెబ్బ..
నాల్గవ టెస్ట్‌లో రిషబ్ పంత్ రూపంలో భారత్ అతిపెద్ద ఎదురుదెబ్బను చవిచూసింది. లార్డ్స్ తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన తర్వాత అతను తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ, మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ వేసిన లో ఫుల్ టాస్ బంతిని రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను గాయపడ్డాడు. బంతి అతనిని బలంగా తాకింది. అతని కాలు రక్తస్రావంతోపాటు వాపు ప్రారంభమైంది.
పంత్ నడుస్తున్నప్పుడు కుంటుతూ ఉన్నాడు. అతన్ని అంబులెన్స్ ద్వారా మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. 2025 ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమ్ ఇండియాకు ఇవి మంచి సంకేతాలు కావు. ఈ ఆటగాళ్లు త్వరగా పూర్తిగా కోలుకోలేకపోతే, భారత జట్టు ఇబ్బందుల్లో పడవచ్చు.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు, IPL 2025లోనూ పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్టార్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను ఔట్ అయినప్పుడు, ఆయుష్ మాత్రే అతని స్థానంలో ఎంపికయ్యాడు.
అదే సమయంలో, ఈ జాబితాలో 2025 ఆసియా కప్‌నకు ముందు IPLలో గాయపడిన దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ రాణా, మయాంక్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. IPLలో ఏ భారత ఆటగాళ్ళు గాయాలను ఎదుర్కోన్నారో ఓసారి చూద్దాం.
గాయపడిన భారత ఆటగాళ్ల పూర్తి జాబితా..
| ప్లేయర్ | జట్టు | గాయం రకం | భర్తీ ఎవరంటే |
|---|---|---|---|
| మాయాంక్ యాదవ్ | లక్నో సూపర్ జెయింట్స్ | వెన్ను గాయం | సీజన్ అంతా బయటే |
| అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్ | లక్నో సూపర్ జెయింట్స్ | శస్త్రచికిత్స | దీర్ఘకాలిక గైర్హాజరు |
| ఉమ్రాన్ మాలిక్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | తుంటి పగుళ్లు | చేతన్ సకారియా |
| రుతురాజ్ గైక్వాడ్ | చెన్నై సూపర్ కింగ్స్ | మోచేయి గాయం | ఆయుష్ మాత్రే |
| గుర్జ్‌పనీత్ సింగ్ | చెన్నై సూపర్ కింగ్స్ | స్ట్రెయిన్ గాయాలు | డెవాల్డ్ బ్రెవిస్ |
| వంశ్ బేడి | చెన్నై సూపర్ కింగ్స్ | ఎడమ చీలమండలో చీలిక | ఉర్విల్ పటేల్ |
| స్మరన్ రవిచంద్రన్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | గాయం | దుబే |
| సందీప్ శర్మ | రాజస్థాన్ రాయల్స్ | వేలు పగులు | నాండ్రే బర్గర్ |
| నితీష్ రాణా | రాజస్థాన్ రాయల్స్ | కండరాల ఒత్తిడి | లువాన్-డ్రే ప్రిటోరియస్ |
| దేవదత్ పడికల్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | తొడ కండరాల నొప్పి | మాయాంక్ అగర్వాల్ |
| రజత్ పాటిదార్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | వేలు గాయం | విశ్రాంతి |
| యుజ్వేంద్ర చాహల్ | పంజాబ్ కింగ్స్ | వేలు గాయం | కోలుకున్న తర్వాత ప్లేఆఫ్‌లకు |
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








