రోడ్డు ప్రమాదంలో క్రికెటర్‌కు తీవ్ర గాయాలు.. కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళుతుండగా..

Lahiru Thirimanne: ఒక రోడ్డు ప్రమాదంలో శ్రీలంక మాజీ క్రికెటర్ లహిరు తిరిమన్నె తీవ్రంగా గాయపడ్డారు. గురువారం (మార్చి 14) శ్రీలంకలోని అనురాధపురలోని తిరపన్నెలో జరిగిన ఈ ప్రమాదంలో శ్రీలంక క్రికెటర్ కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదే సమయంలో, స్థానికులు వెంటనే కారులో ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చారు

రోడ్డు ప్రమాదంలో క్రికెటర్‌కు తీవ్ర గాయాలు.. కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళుతుండగా..
Lahiru Thirimanne

Updated on: Mar 14, 2024 | 4:02 PM

Lahiru Thirimanne:  ఒక రోడ్డు ప్రమాదంలో శ్రీలంక మాజీ క్రికెటర్ లహిరు తిరిమన్నె తీవ్రంగా గాయపడ్డారు. గురువారం (మార్చి 14) శ్రీలంకలోని అనురాధపురలోని తిరపన్నెలో జరిగిన ఈ ప్రమాదంలో శ్రీలంక క్రికెటర్ కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదే సమయంలో, స్థానికులు వెంటనే కారులో ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చారు. తిరిమన్నె కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్తుండగా నగరంలోని తిరపన్నె వద్ద ఆయన కారు లారీని ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో లారీ బోల్తా పడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుత నివేదికల ప్రకారం లహిరు తిరిమన్నేకు తీవ్ర గాయాలయ్యాయని, అయితే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు. “లహిరు తిరిమన్నె, అతని కుటుంబం ఆలయాన్ని సందర్శిస్తున్నప్పుడు చిన్న కారు ప్రమాదంలో చిక్కుకున్నారు. అదృష్టవశాత్తూ, వారు క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. తిరిమన్నే కుటుంబం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అతని కుటుంబీకుల్లో ఒకరు చెప్పుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి

2010లో శ్రీలంక తరఫున అరంగేట్రం చేసిన తిరిమన్నె 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక తరఫున 44 టెస్టు మ్యాచ్‌లు ఆడిన లాహిరు తిరిమన్నె 3 సెంచరీలతో 2088 పరుగులు చేశాడు. 127 వన్డేల్లో 3164 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే శ్రీలంక తరఫున 26 టీ20 మ్యాచ్‌లు ఆడి 291 పరుగులు చేశాడు లహిరు తిరిమన్నె. ప్రస్తుతం రిటైర్డ్ అయిన 34 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ వివిధ లీగ్‌లలో పాల్గొంటున్నాడు. ఇటీవల ముగిసిన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో కూడా ఆడాడీ మాజీ ప్లేయర్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..