AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

65 నిమిషాల బ్యాటింగ్.. 8 సిక్సర్లు, 12 ఫోర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ సృష్టించిన రగ్బీ ప్లేయర్.. ఎవరంటే?

మనలో ప్రతిభ ఉంటే.. దాన్ని దాచిపెట్టడం ఎవరి వల్ల కాదు.. సరిగ్గా 5 నెలల క్రితం ఓ రగ్బీ ఆటగాడు క్రికెట్‌లో తుఫాన్..

65 నిమిషాల బ్యాటింగ్.. 8 సిక్సర్లు, 12 ఫోర్లతో బౌలర్ల ఊచకోత.. తుఫాన్ సృష్టించిన రగ్బీ ప్లేయర్.. ఎవరంటే?
Mark Adair
Ravi Kiran
|

Updated on: Dec 21, 2022 | 11:49 AM

Share

మనలో ప్రతిభ ఉంటే.. దాన్ని దాచిపెట్టడం ఎవరి వల్ల కాదు.. సరిగ్గా 5 నెలల క్రితం ఓ రగ్బీ ఆటగాడు క్రికెట్‌లో తుఫాన్ సృష్టించాడు. కేవలం 49 బంతుల్లో 111 పరుగులు బాదేశాడు. ఇక ఇప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించిన ఆ దేశ మాజీ రగ్బీ ఆటగాడు మరెవరో కాదు రాస్ అడైర్(Ross Adair). జనవరిలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న ఐర్లాండ్ క్రికెట్ జట్టులో రాస్ అడైర్‌‌కు కూడా చోటు లభించింది.

వాస్తవానికి రగ్బీ ప్లేయరైన రాస్ అడైర్.. ఆ ఆటను విడిచిపెట్టి.. 2021వ సంవత్సరంలో క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. నార్తర్న్ నైట్స్ తరపున లిస్ట్-ఏ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ సమయంలో అడైర్ కేవలం 49 బంతుల్లో 111 పరుగులు చేసి.. తనలోని అసాధారణ ప్రతిభను బయటపెట్టాడు. 65 నిమిషాల్లో అతడు ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. ఇదే అతడి చివరి మ్యాచ్. కాగా, అంతకముందు రాస్ అడైర్‌ 15 టీ20 మ్యాచ్‌లలో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీతో 301 పరుగులు చేశాడు. ఇది కాకుండా, రాస్ అడైర్ 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ లోర్కాన్ టక్కర్ స్థానంలో అడైర్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే జట్టులో ఎంపికయ్యాడు.