కావ్యపాప ఛీ కొట్టింది.. పాకిస్తాన్ హగ్ ఇచ్చింది.. కట్‌చేస్తే.. కసితీరా రికార్డులతో రప్ప.. రప్పా
David Warner: ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, ఇప్పుడు పీఎస్ఎల్ వంటి అనేక టీ20 లీగ్‌లలో వార్నర్ తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అతను ఇప్పటివరకు ఎనిమిది సెంచరీలు, 109 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. వార్నర్ తర్వాత, కోహ్లీ 101 హాఫ్ సెంచరీలు చేశాడు.

David Warner completes 13000 runs in T20: ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు, పెషావర్ జల్మీతో జరిగిన ఈ మ్యాచ్‌లో, అతను 47 బంతుల్లో 60 పరుగులు చేసి ఈ చారిత్రాత్మక ఫీట్‌ను చేరుకున్నాడు. వార్నర్ టీ20 కెరీర్ అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు అతను 403 ఇన్నింగ్స్‌లలో 13,009* పరుగులు చేశాడు. అలా చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.ః
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ ఇప్పుడు ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇప్పటికీ వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 455 ఇన్నింగ్స్‌లలో 14,562 పరుగులు చేశాడు. గేల్ తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ 490 ఇన్నింగ్స్‌లలో 13,610 పరుగులు చేశాడు. మూడో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ ఉన్నాడు. అతను 515 ఇన్నింగ్స్‌లలో 13,571 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ 617 ఇన్నింగ్స్‌లలో 13,537 పరుగులు చేశాడు. భారత స్టార్ విరాట్ కోహ్లీ 390 ఇన్నింగ్స్‌లలో 13,208 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, ఇప్పుడు పీఎస్ఎల్ వంటి అనేక టీ20 లీగ్‌లలో వార్నర్ తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అతను ఇప్పటివరకు ఎనిమిది సెంచరీలు, 109 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. వార్నర్ తర్వాత, కోహ్లీ 101 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో వార్నర్ స్ట్రైక్ రేట్ 140, సగటు 37గా ఉంది. ఈ ఫార్మాట్‌లో వార్నర్ కెరీర్ ఎంత గొప్పగా ఉందో ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఐపీఎల్‌లోని దాదాపు ప్రతి సీజన్‌లో ఆడిన వార్నర్‌ను ఈ సీజన్ వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో మొదటిసారి PSL ఆడటానికి వచ్చాడు.
డేవిడ్ వార్నర్ కీలక ఇన్నింగ్స్:
Captain’s knock! 😎
Welcome to David Warner show! 💙❤️ #YehHaiKarachi | #KingsSquad | #KKvPZ pic.twitter.com/qM8D5wXYFi
— Karachi Kings (@KarachiKingsARY) April 21, 2025
ఈ ఫార్మాట్‌లో 22 సెంచరీలు చేసిన గేల్ ఇప్పటికీ టీ20 క్రికెట్‌లో మకుటం లేని రారాజుగా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 నాటౌట్ ఇన్నింగ్స్ కూడా ఉంది. గేల్ టీ20 క్రికెట్‌లో 1056 సిక్సర్లు బాదాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








