Team India: ‘ఆసియా కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆ ప్లేయర్‌ను చేర్చితే ఇబ్బందులే.. ఘోర తప్పిదం చేసినట్లే’
Team India Asia Cup 2023: కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన ఫిట్‌నెస్‌పై పనిచేస్తున్నాడు. రాహుల్ తొడకు గాయం కాగా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం, అతను 50 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నాడు. అతను వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల టెస్టులో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే రాహుల్‌కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కుతుంది.
Asia Cup 2023: టీమిండియా మాజీ ప్రధాన కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి తన వ్యాఖ్యానంతో పాటు వాక్చాతుర్యంతో కూడా పేరుగాంచాడు. శాస్త్రి ఇప్పుడు కేఎల్ రాహుల్‌పై కీలక ప్రకటన చేశాడు. ఆసియా కప్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో కేఎల్ రాహుల్‌ను తీసుకోవడం సరైన నిర్ణయం కాదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఈ ఆటగాడు వన్డే ఫార్మాట్‌లో అద్భుతంగా ఆడుతాడు. అయితే, రవిశాస్త్రి చేసిన ఈ ప్రకటన చాలా షాకింగ్‌గా మారింది. ముఖ్యంగా 4వ నంబర్, 5వ ర్యాంక్‌లో కేఎల్ రాహుల్ రికార్డు అద్భుతంగా ఉంది. అయితే, ఆసియా కప్‌లో ప్రారంభ మ్యాచ్‌లలో రాహుల్‌ను ప్లేయింగ్ XIలో ఉంచడం సరికాదని రవిశాస్త్రి చెబుతున్నాడు. ఇంతకీ, రవిశాస్త్రి ఇలా ఎందుకు అన్నాడు? ఇప్పుడు తెలుసుకుందాం..
స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రవిశాస్త్రి, కేఎల్ రాహుల్ గురించి మాట్లాడితే, అతను పెద్దగా ఆడలేదు. అతను గాయం నుంచి కోలుకుంటున్నాడు . అతనిని ఆసియా కప్‌లోని ప్లేయింగ్ XIలోకి తీసుకుంటే, మీరు అతని నుంచి చాలా ఎక్కువ ఆశించినట్లు అవుతుంది. రాహుల్ కీపింగ్ కూడా చేస్తాడని మీరు అంటున్నారు. ఒక ఆటగాడు గాయం నుంచి తిరిగి వచ్చినప్పుడు, అతని కదలిక పరిధి మునుపటిలా ఉండదని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
బ్యాటింగ్ ప్రాక్టీస్..
View this post on Instagram
రాహుల్ ఆడకపోతే ఏమవుతుంది?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచకపోతే ఏమి జరుగుతుంది? కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అతను వికెట్ కీపింగ్ కూడా చేస్తే టీమ్ ఇండియా బలం మరింత పెరుగుతుంది. రాహుల్ జట్టుకు చక్కటి సమతూకం అందిస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ ఆడకపోతే 5వ నంబర్‌లో ఎవరు ఆడతారు. సమాధానం తెలుసుకోవడం కష్టం. ఈ స్థానంలో ఆడేందుకు సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వంటి పేర్లు ఉన్నాయి. కానీ, ఈ బ్యాట్స్‌మెన్‌లకు రాహుల్‌లా నమ్మకం లేదంటూ ప్రకటించాడు.
ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన రాహుల్..
View this post on Instagram
కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన ఫిట్‌నెస్‌పై పనిచేస్తున్నాడు. రాహుల్ తొడకు గాయం కాగా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం, అతను 50 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నాడు. అతను వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల టెస్టులో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే రాహుల్‌కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కుతుంది.
రాహుల్ ప్రాక్టీస్..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..