AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ‘హార్దిక్ విలువ రూ. 18 కోట్లా? డబ్బులు వృథా చేయడమే’.. ఆసీస్ మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

IPL 2025, Mumbai Indians Retention List: బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే 2025 సీజన్ కోసం రిటెన్షన్ పాలసీని విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబరు 31లోగా తమ జట్టులో చేర్చుకోవడానికి రిటైన్ చేసిన ఆటగాళ్లందరి పేర్లను జట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్ విషయంలో హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

IPL 2025: 'హార్దిక్ విలువ రూ. 18 కోట్లా? డబ్బులు వృథా చేయడమే'.. ఆసీస్ మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
దీని ప్రకారం గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (2 సార్లు), పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో స్లో ఓవర్ రేట్ పొరపాటు చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL 2025 మొదటి మ్యాచ్ నుంచి నిషేధానికి గురయ్యాడు.
Venkata Chari
|

Updated on: Oct 04, 2024 | 1:59 PM

Share

IPL 2025, Mumbai Indians Retention List: బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే 2025 సీజన్ కోసం రిటెన్షన్ పాలసీని విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబరు 31లోగా తమ జట్టులో చేర్చుకోవడానికి రిటైన్ చేసిన ఆటగాళ్లందరి పేర్లను జట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్ విషయంలో హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. రూ. 18 కోట్ల కేటగిరీలో హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు రిటైన్ చేయదంటూ అభిప్రాయపడ్డాడు.

హార్దిక్ పాండ్యా విలువ రూ. 18 కోట్లు?

IPL గత 2024 ఎడిషన్‌లో జరిగిన కొన్ని మార్పులు, ఆ తర్వాత గత ఆరు నుంచి 12 నెలలుగా మారిన పరిస్థితుల మేరకు ముంబై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లను రూ. 18 కోట్ల కేటగిరీలో ఉంచాలనుకుంటున్నట్లు టామ్ మూడీ తెలిపాడు. హార్దిక్ పాండ్యా రూ.14 కోట్లు రాబట్టగలిగితే అది అతని ప్రదర్శన, ఫామ్, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నాడు. హార్దిక్ పాండ్యాను గమనిస్తే, అతని విలువ రూ.18 కోట్లా? అనే డౌట్ వస్తోందంటూ షాకిచ్చాడు. రూ. 18 కోట్లు తీసుకుంటున్నప్పుడు నిజమైన మ్యాచ్ విన్నర్‌గా ఎదగాలి. క్రమం తప్పకుండా అదే ఫాంను కొనసాగించాల్సి ఉంటుందని సూచించాడు. హార్దిక్ పాండ్యా కూడా గత ఎడిషన్‌లో తన ప్రదర్శన, ఫిట్‌నెస్‌తో పోరాడుతున్నట్లు కనిపించడంతో.. అతని జీతంపై ఎఫెక్ట్ పడుతుందని ఆయన సూచించాడు.

ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా తొలి సీజన్‌లో విఫలం..

ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే, గత 2024 సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై యాజమాన్యం కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంచుకుంది. అయితే, దీన్ని ముంబై అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్‌ కెప్టెన్‌గా టాస్‌కు వచ్చిన ప్రతిచోటా అభిమానులు అతడ్ని హేళన చేసేవారు. IPL 2025కి ముందు ముంబై ఇండియన్స్ కొన్ని పెద్ద అడుగులు వేయడానికి ఇదే కారణం. హార్దిక్ కెప్టెన్సీలో, ముంబై జట్టు మొదటి సీజన్‌లో 14 మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే గెలవగలిగింది. 10 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..