Virat Kohli: విరాట్ కోహ్లీకి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తా: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్
Mark Taylor asked his daughter to marry Virat Kohli: విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం తన గురించి ఇలా ఆలోచించారని తెలియడం కోహ్లీ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mark Taylor Asked His Daughter to Marry Virat Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఆటతీరుకు, దూకుడైన స్వభావానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మార్క్ టేలర్ ఒక అడుగు ముందుకేసి, తన కుమార్తెను విరాట్ కోహ్లీకి ఇచ్చి వివాహం చేయాలని సరదాగా వ్యాఖ్యానించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ నిర్వహిస్తున్న ‘విల్లో టాక్’ అనే పాడ్‌కాస్ట్‌లో మార్క్ టేలర్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విరాట్ కోహ్లీతో తన తొలి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ, అతని ప్రవర్తన, వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.
“కొన్నేళ్ల క్రితం నేను విరాట్ కోహ్లీని మొదటిసారి కలిశాను. అప్పటికే అతను క్రికెట్‌లో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అతనితో మాట్లాడినప్పుడు, అతనిలోని వినయం, పెద్దల పట్ల గౌరవం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో నా కుమార్తె వయసు 17 సంవత్సరాలు. నేను ఆమెను కోహ్లీకి పరిచయం చేసి, ‘నీకు ఇష్టమైతే, విరాట్ కోహ్లీని వివాహం చేసుకోవచ్చు’ అని సరదాగా అన్నాను. నా మాటలకు నా కుమార్తె సిగ్గుతో ముడుచుకుపోయింది,” అని టేలర్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో విరాట్ కోహ్లీకి ఇంకా వివాహం కాలేదని, అతని వ్యక్తిత్వం చూసి ఎవరైనా ఇష్టపడతారని టేలర్ అన్నారు. కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, బయట అంత ప్రశాంతంగా, గౌరవంగా ప్రవర్తిస్తాడని కితాబిచ్చారు. ఒక గొప్ప ఆటగాడిలో ఉండాల్సిన లక్షణాలన్నీ కోహ్లీలో ఉన్నాయని, అందుకే తాను అలా సరదాగా వ్యాఖ్యానించానని టేలర్ వివరించారు.
మార్క్ టేలర్ వీడియో..
Mark Taylor about Virat Kohli, he will never forget when a young Kohli showed him the upmost respect. pic.twitter.com/JN1Smy8TA7
— aaisha (@awkaaisha) June 15, 2025
ప్రస్తుతం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం తన గురించి ఇలా ఆలోచించారని తెలియడం కోహ్లీ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యర్థి జట్టు మాజీ కెప్టెన్ సైతం కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఇంతగా ప్రశంసించడం, అతని గొప్పతనానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








