సంచలనం W W W W W.. ఒకే ఓవర్లో వరుసగా 5 వికెట్లు తీసిన సంతకాల స్టార్! ఏ టోర్నీలో అంటే..?
ఐపీఎల్ 2025లో సెలబ్రేషన్స్‌తో ప్రసిద్ధి చెందిన దిగ్వేష్ రఠీ తాజాగా స్థానిక టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నాలుగు క్లీన్ బౌల్డ్‌లు, ఒక ఎల్‌బీడబ్ల్యూ తో అతని బౌలింగ్ అందరినీ మెప్పించింది.

ఈ నెల 3న ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్‌లో ఓ ప్లేయర్ తన ఆట కంటే కూడా తన సెలబ్రేషన్స్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్‌లో వేలంలో తనకొచ్చిన డబ్బు కంటే కూడా తన సెలబ్రేషన్స్ కారణం ఫైన్లు ఎక్కువ కడుతున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎస్.. అతనే. సంతకాల స్టార్ దిగ్వేష్ రఠీ. ఐపీఎల్ 18వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింగ్స్ తరఫున ఆడి.. సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న దిగ్వేష్.. వికెట్ తీసిన తర్వాత సైన్ సెలబ్రేషన్‌తో మరింత గుర్తింపు పొందాడు. ఈ సెలబ్రేషన్స్ విషయంలో అతనికి ఫైన్లే కాదు.. ఒక మ్యాచ్ నిషేధం కూడా పడింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మతో గొడవ కూడా అయింది. మొత్తంగా ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి మంచి బౌలింగ్‌తో పాటు వెరైటీ సెలబ్రేషన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్వేష్.. తాజాగా ఓ లోకల్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఏకంగా ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో ఐదు వికెట్లు తీసి వావ్ అనిపించాడు. అతని బౌలింగ్ ప్రదర్శనకు ఏకంగా లక్నో ఓపెనర్ సంజీవ్ గోయెంకా సైతం ఫిదా అయిపోయారు. అతను ఐదు వికెట్లు పడగొట్టిన వీడియోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. దిగ్వేష్ ను మెచ్చుకున్నారు.
ఓ స్థానిక టీ20 మ్యాచ్ సందర్భంగా దిగ్వేష్ ఈ ఘనత సాధించాడు. తన గూగ్లీ ఫ్లిప్పర్ బంతులను బ్యాటర్లు అర్థం చేసుకోలేకపోయారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన దిగ్వేష్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఆ ఐదు వికెట్లలో ఏకంగా నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్‌గా వచ్చాయి. ఒక్కటి ఎల్‌బీడబ్ల్యూగా వచ్చింది. ప్రత్యర్థి జట్టుకు విజయానికి 6 ఓవర్లలో 113 పరుగులు కావాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్‌కు వచ్చిన దిగ్వేష్.. ఆ ఈక్వేషన్‌ను మరింత కఠినంగా మార్చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో దిగ్వేష్ 7 వికెట్లు పడగొట్టాడు.
Stumbled upon this clip of Digvesh Rathi taking 5 in 5 in a local T20 game. Just a glimpse of the talent that made him a breakout star for @LucknowIPL in IPL 2025. pic.twitter.com/i8739cjxpk
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) June 16, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




