AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: హైదరాబాద్ టీంకా బహుత్ అచ్చా.. కావ్య పాపా నేను నీ కోసమే వచ్చా! హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ భయ్యా

SRH vs PBKS మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. స్టేడియంలో ఆమె హావభావాలు, ఓ అభిమాని చేసిన “కావ్య పాపా నేను నీ కోసమే వచ్చా” అనే ప్రేమ ప్రపోజల్ వైరల్ అయ్యాయి. మ్యాచ్ విషయానికి వస్తే, PBKS 245 పరుగులు చేయగా SRH అభిషేక్ శర్మ సెంచరీతో రికార్డు ఛేజ్‌ చేసింది. చివర్లో క్లాసెన్, ఇషాన్ కిషన్ కలిసి జట్టును గెలిపించారు.

Video: హైదరాబాద్ టీంకా బహుత్ అచ్చా.. కావ్య పాపా నేను నీ కోసమే వచ్చా! హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ భయ్యా
Kavya Maran Srh
Follow us
Narsimha

|

Updated on: Apr 13, 2025 | 12:30 PM

ఐపీఎల్ 2025 సీజన్‌లో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో మైదానంలో జరిగిన ఆటకు మించిన ఆకర్షణగా నిలిచింది SRH ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆమె ఒక స్టార్. చాలామంది అభిమానులు సన్‌రైజర్స్ ఆట కంటే కావ్య మారన్‌ని మైదానంలో చూసేందుకే వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినీ నటి తలపించే ఆమె అందం, ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. ఆమె స్టేడియంలో కనిపించగానే కెమెరాలు వెంటనే ఆమె వైపు మళ్లుతాయి. బౌలర్ వికెట్ తీసినా, బ్యాట్స్‌మన్ బౌండరీ కొట్టినా, వెంటనే టీవీ స్క్రీన్‌పై కనిపించే వ్యక్తి కావ్య మారనే. మ్యాచ్‌లో SRH అద్భుతంగా ఆడుతున్నప్పుడు ఆమె చేసే కేరింతలు, ఓటమి ఎదురైనప్పుడు పెడే నిరాశాభావాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

ఇలా ఐపీఎల్‌కి ఓ ప్రత్యేక ముద్రవేసిన కావ్య మారన్ ఉప్పల్ స్టేడియంలో SRH vs PBKS మ్యాచ్‌కు హాజరైంది. మ్యాచ్ మొత్తం సమయంలో ఆమె ఎక్స్‌ప్రెషన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని తన ప్రేమను చాటుకునేలా నడిచాడు. మ్యాచ్ జరుగుతుండగా, “హైదరాబాద్ టీంకా బహుత్ అచ్చా… కావ్య పాపా నేను నీ కోసమే వచ్చా!” అంటూ గట్టిగా అరిచాడు. ఈ వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, నెటిజన్లు “కావ్య పాపా క్రేజ్ ఇదే!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు “రేవ్ ఎవర్రా మీరంతా!” అంటూ సరదాగా స్పందిస్తే, మరికొందరు మాత్రం “కావ్య గురించి మాట్లాడితే మర్డర్ చేస్తాం” అంటూ హాస్యంగా స్పందించారు.

ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రియాంష్ ఆర్య (13 బంతుల్లో 36 పరుగులు, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ప్రభ్సిమ్రాన్ సింగ్ (23 బంతుల్లో 42 పరుగులు, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) మిడిలార్డర్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు, ఇందులో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. చివర్లో మార్కస్ స్టోయినిస్ విజృంభించి 11 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. మొత్తం మీద పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 245/6 స్కోరు చేసింది. SRH తరఫున హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా, ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 66 పరుగులు), అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141 పరుగులు, 14 ఫోర్లు, 10 సిక్సర్లు) అద్భుతమైన ఆరంభ భాగస్వామ్యం అందించారు. ఇద్దరూ కలిసి 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ ఆటను ముందుండి నడిపించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (21 నాటౌట్), ఇషాన్ కిషన్ (9 నాటౌట్) అవసరమైన పరుగులు సాధించి జట్టును గెలుపు గీత దాటి నడిపించారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..