Video: పాక్ జర్నలిస్టుపై డేవిడ్ భాయ్ ఫైర్! ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడుగా..
ఐపీఎల్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన డేవిడ్ వార్నర్, పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్ తరఫున కెప్టెన్‌గా అరంగేట్రం చేయబోతున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ జర్నలిస్ట్ వేసిన ట్రోలింగ్ ప్రశ్నకు వార్నర్ గంభీరంగా సమాధానం ఇచ్చి ఆకట్టుకున్నాడు. గత ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శన చేసినా అతడిని వేలంలో ఎవ్వరూ కొనలేదు. కానీ పీఎస్‌ఎల్‌లో అత్యధిక ధరతో ఎంపికై, తన క్రేజ్‌ను మరోసారి రుజువు చేయాలని సిద్ధమయ్యాడు.

ఐపీఎల్ అంటే తెలుగు క్రికెట్ అభిమానులకు ముందు గుర్తొచ్చే పేర్లలో ధోనీ, కోహ్లీ, రోహిత్‌తో పాటు ఒకప్పుడు టక్కున గుర్తొచ్చేది డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌గా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వార్నర్, ఆ జట్టులో కెప్టెన్‌గా పని చేసి టైటిల్‌ను అందించడంతో పాటు, తెలుగు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. కానీ సమయం మారింది. మొదట సన్‌రైజర్స్ వదులుకుని, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఆడిన వార్నర్, 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఎవరూ కొనకుండా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో ఆయన పూర్తిగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అయితే, క్రికెట్‌కు అతడి ప్యాషన్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు పాక్ లీగ్ అయిన పీఎస్‌ఎల్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. కరాచీ కింగ్స్ జట్టు అతడిని పీఎస్‌ఎల్ చరిత్రలోనే అత్యధిక ధర అయిన రూ.2.58 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే కాదు, వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది.
ఈ నేపథ్యంలో తొలిమ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వార్నర్‌కు పాక్ జర్నలిస్ట్ ఊహించని ప్రశ్నను సంధించాడు. “మీరు ఐపీఎల్ 2025లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన తర్వాత పీఎస్‌ఎల్‌లో ఆడుతుంటే ఇండియన్ ఫ్యాన్స్ మీపై ట్రోల్స్ చేస్తున్నారు, దానికి మీ సమాధానం ఏమిటి?” అని అడిగాడు. దీనికి వార్నర్ చాలా ప్రశాంతంగా, గంభీరంగా స్పందిస్తూ, “ఇలాంటి విషయం నేనింకా వినలేదు. ఇది మొదటిసారి వింటున్నాను. నాకు ముఖ్యమయింది క్రికెట్ ఆడటమే. ఇప్పుడు పీఎస్‌ఎల్‌లో ఆడే అవకాశం వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా ఇంతకుముందు నేను పీఎస్‌ఎల్‌లో పాల్గొనలేకపోయాను. ఇప్పుడు కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును విజయతీరాలకు చేర్చేలా ప్రయత్నిస్తాను,” అని సమాధానమిచ్చాడు.
వార్నర్ క్రికెట్‌లోని తన ప్రదర్శనతో ఎప్పటికప్పుడు రికార్డులను నెలకొల్పుతూ వచ్చాడు. గత ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అతడు, జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ 2025 వేలంలో ఎవరూ అతడిని కొనుగోలు చేయకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇప్పటికీ టీ20ల్లో అత్యద్భుతమైన రికార్డులున్న వార్నర్, 37 సగటుతో, 140.23 స్ట్రైక్‌రేట్‌తో ఇప్పటివరకు 399 టీ20 మ్యాచుల్లో 12,913 పరుగులు సాధించాడు. ఈ సమర్ధవంతమైన ఆటగాడు ఇప్పుడు పీఎస్‌ఎల్‌లో తన క్రేజ్‌ను మరోసారి చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్‌కు దూరమైనా, పీఎస్‌ఎల్‌లో కెప్టెన్‌గా తళుక్కున మెరుస్తూ తన క్లాస్‌ను చాటాలని భావిస్తున్నాడు. మొత్తంగా, పాక్ సూపర్ లీగ్ వేదికగా, డేవిడ్ వార్నర్ మరో కొత్త ప్రయాణానికి పటాకి లాంటి స్టార్ట్ ఇవ్వబోతున్నాడు.
David Warner on trolling about being rejected from IPL
"For my perspective, it's about playing cricket, and it's an opportunity for me to come to PSL. Before this, the international calendar didn't allow me to come here due to the timings."" pic.twitter.com/kh2LFesPBN
— ٰImran Siddique (@imransiddique89) April 11, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..