T20 World Cup: హిట్‌మ్యాన్‌ను హగ్‌ చేసుకునేందుకు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన కుర్రాడు.. సెక్యూరిటీ అడ్డుకోవడంతో కంటతడి

భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఓ టీనేజర్‌ మువ్వెన్నల జెండా పట్టుకుని మైదానంలోకి వచ్చేశాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. కాగా మైదానంలోకి వచ్చిన అతను ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు.

T20 World Cup: హిట్‌మ్యాన్‌ను హగ్‌ చేసుకునేందుకు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన కుర్రాడు.. సెక్యూరిటీ అడ్డుకోవడంతో కంటతడి
Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2022 | 9:12 AM

మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన జింబాబ్వేను 71 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా టీ 20 ప్రపంచకప్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. అంతేకాదు భారీ విజయంతో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి గ్రూప్-2లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా జింబాబ్వేకు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ జట్టు 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. కాగా జింబాబ్వే జట్టు ఇన్నింగ్స్‌ కొనసాగుతున్న సమయంలో.. మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఓ టీనేజర్‌ మువ్వెన్నల జెండా పట్టుకుని మైదానంలోకి వచ్చేశాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. కాగా మైదానంలోకి వచ్చిన అతను ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి లాక్కెళ్లారు. ఈ సమయంలో ఒక్క షేక్ హ్యాండ్ లేదా కనీసం హగ్‌ ఇవ్వాల్సిందిగా రోహిత్ శర్మ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరికీ బాధను కలిగించింది. కాగా పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడం చూసి రోహిత్ సహా మిగతా భారత ఆటగాళ్లు సర్దిచెప్పారు. రోహిత్ అధికారుల వద్దకు పరుగున వచ్చి అభిమానిని ఏం చేయవద్దని కోరాడు. దీంతో పోలీసులు టీనేజర్‌ను స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు.

భారీ జరిమానా..

కాగా మైదానంలోకి వచ్చిన ఆ కుర్రాడు రోహిత్‌ అభిమాని అని తెలుస్తోంది. అయితే ఎంత అభిమానం ఉన్నా ఆటగాళ్లు కూడా తమ భద్రత దృశ్యా ఎవరిని దగ్గరికి రానియ్యరు. అయితే సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి ఎంటర్ అయినందుకు ఆ కుర్రాడికి క్రికెట్‌ ఆస్ట్రేలియా రూ.6 లక్షల 50 వేల భారీ జరిమానా విధించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రపంచకప్‌లో అభిమానులు మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి రావడం ఇది రెండో సారి. దీంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ , కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. రాహుల్ 35 బంతుల్లో 51 పరుగులు చేయగా, సూర్యకుమార్ 25 బంతుల్లో 61 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లోనూ రోహిత్‌ ఫ్లాప్‌ అయ్యాడు. అతను 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జింబాబ్వే తరఫున ర్యాన్ బర్లే అత్యధికంగా 35 పరుగులు చేశాడు. భారత స్టార్ స్టార్ అశ్విన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌ తర్వాత సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..