India vs Zimbabwe: తగ్గేదే లే.. మెల్‌బోర్న్ సందుల్లోనూ.. క్రికెట్ గ్రౌండ్‌లోనూ ఊపేస్తున్న ‘ఊ అంటావా మావ’
ఒక పక్క ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 వరల్డ్ కప్ ఫీవర్ లో పడి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఊగిపోతుంటే.. మరోపక్క అక్కడ మెల్ బోర్న్ లో మ్యాచ్ లకు వస్తున్న జనం మన పుష్ప సినిమా సాంగ్ పెడితే చాలు.. చెలరేగిపోయి డ్యాన్సులాడుతున్నారు.

అల్లు అర్జున్ పుష్ప మూవీ మేనియా ఇక్కడే అనుకుంటివా.. బయట కూడా భారీగా ఉంది. మరీ ముఖ్యంగా.. స్టార్ యాక్ట్రెస్ సమంత ఒక ఊపు ఊపిన ఊ అంటావా పాటంటే.. ఉట్టి ఐటెం నెంబరే అనుకుంటివా.. ఇంటర్నేషనల్లీ థండర్. పుష్ప సినిమా రిలీజై.. చాలా కాలమే అయ్యింది. ఆ సినిమా సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే రాబోతోంది. అప్పటి వరకూ.. ఫస్ట్ పార్ట్ లోని డైలాగ్స్, మేనరిజమ్స్, సాంగ్స్.. సందడి చేస్తాయేమో తెలీదు కానీ.. ఊ అంటావా మామ.. చాలా దూరం వెళ్లింది. ఆసీస్ లో జరుగుతోన్న వరల్డ్ కప్ టోర్నీ వరకూ. భారత్, జింబాబ్వే మ్యాచ్ సందర్భంగా మెల్‌బోర్న్ స్టేడియం దగ్గర సందడి చేసిందీ పాట. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానం బయట ఊ అంటావా మావ పాటను ప్లే చేయగా, టీమిండియా అభిమానులు ఊగిపోతూ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
పుష్ప పానిండియా మూవీ కాబట్టి.. ఇక్కడ ఇండియాలో ఆ మాత్రం హల్ చల్ చేయడం సహజం. కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్లలో కూడా ఈ సినిమాలోని పాట ఇంతగా ఉర్రూతలూగించడం చూస్తుంటే.. ఇట్స్ వండ్రఫుల్ అంటున్నారు ఒక్కొక్కరూ. అసలా పాటలో ఏముందో తెలీదు కానీ.. విన్న వెంటనే ఊగిపోతాం.. అంటూ చెప్పుకొస్తున్నారు.
ఏది ఏమైనా ఇది తెలుగు సినిమా పాటల పవర్ గా అభివర్ణిస్తున్నారు మరి కొందరు. మెస్మరైజింగ్ కెపాసిటీ ఉంటే.. ప్రాంతీయ భాషా- బేధాలుండవని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి పుష్ప తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వేదికలపై చాటింది. తెలుగు సినిమా తగ్గేదే లే అంటూ ఎల్లలు దాటి.. పరుగులు పెడుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
