Guinness World Record: ఇదొక సంచలనం.. ఒక్క నిమిషం వ్యవధిలో వెయ్యికి పైగా చప్పట్లు.. కట్ చేస్తే..

ఇతరులను అభినందించడానికి ఎవరైనా చప్పట్లు కొడుతారు. చప్పట్లు కొట్టడానికి కాల వ్యవధిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, అతను మాత్రం..

Guinness World Record: ఇదొక సంచలనం.. ఒక్క నిమిషం వ్యవధిలో వెయ్యికి పైగా చప్పట్లు.. కట్ చేస్తే..
Guinness World Record
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 07, 2022 | 6:08 AM

ఇతరులను అభినందించడానికి ఎవరైనా చప్పట్లు కొడుతారు. చప్పట్లు కొట్టడానికి కాల వ్యవధిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, అతను మాత్రం పక్కా పట్టించుకుంటాడు. ఆ కాల వ్యవధిలోనే తనదైన మార్క్‌ వేశాడు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏ కంగా 1140 సార్లు చప్పట్లు ఔరా అనిపించుకున్నాడు. అంటే ఒక్క సెకనులో 19సార్లు చప్పట్లు కొట్టి రికార్డ్ సంచలనం సృష్టించాడు. అంతటితో ఆగలేదు ఆ యువకుడు.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ట్రై చేశాడు. ఆ ప్రయత్నం ఫలించింది.

అమెరికాకు చెందిన డాల్టన్ మేయర్. చప్పట్లు కొట్టడంలో చాలా స్పీడ్. ఈ యువకుడు సెకన్లలోనే చాలా వేగంగా వందల సంఖ్యలో చప్పట్లు కొట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులను అప్రోచ్ అయ్యాడు. నిమిషం వ్యవధిలోనే 1000 మార్క్ దాటి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. ఒక్క నిమిషంలోనే 1140 సార్లు చప్పట్లు కొట్టాడు. అంటే ఒక్క సెకనులో 19 సార్లు చప్పుడు కొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అతని ట్యాలెంట్‌కు ఫిదా అయిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు, అతన్ని గుర్తించారు. అతను ఈ ఏడాది మార్చి నెలలో ఈ ఫీట్‌ను చేసినప్పటికీ.. తాజాగా అధికారికంగా గుర్తించి, ప్రకటించారు. కాగా, డాల్టన్ మేయర్.. మణికట్టును ఉపయోగించి చప్పట్లు కొట్టాడు. అయితే, డాల్టన్ కంటే ముందు మరో వ్యక్తి పేరిట ఈ రికార్డ్ ఉండేది. ఒక నిమిషంలో 1103 సార్లు క్లాప్స్ కొట్టిన ఎలి బిషప్ పేరిట ఈ రికార్డ్ ఉండగా, డాల్టన్ ఇప్పుడు దానిని చెరిపేసి తన పేరిట రికార్డ్ నెలకొల్పాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..