AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రేయాస్ బ్లండర్ మిస్టేక్‌.. ఆ ఒక్క తప్పుతో టీమిండియా కొంపముంచేసిన సర్పంచ్ సాబ్..

Shreyas Iyer Captaincy: మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ తమ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉందని, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఘోరంగా విఫలమయ్యామని అంగీకరించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డ భారత్, తదుపరి జరగబోయే బ్రిస్టల్ మ్యాచ్‌లోనైనా పుంజుకుని పరువు నిలుపుకుంటుందో లేదో చూడాలి.

శ్రేయాస్ బ్లండర్ మిస్టేక్‌.. ఆ ఒక్క తప్పుతో టీమిండియా కొంపముంచేసిన సర్పంచ్ సాబ్..
Ind Vs Eng Shreyas Iyer Toss Mistake
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 9:06 AM

Share

Shreyas Iyer Captaincy: ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత టీ20 జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ట్రెండ్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాల్సిన పిచ్‌పై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం భారత జట్టు కొంపముంచగా, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

టాస్ నిర్ణయమే కొంపముంచింది.. కెప్టెన్ వ్యూహం ఫ్లాప్!

టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు సాధించడానికి అనుకూలమైన ట్రెండ్ బ్రిడ్జ్ పిచ్‌పై, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పిచ్ స్వభావాన్ని అంచనా వేయడంలో టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ఈ అతిపెద్ద తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, ఆఖర్లో సామ్ కరన్, విల్ జాక్స్ వేగంగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేక చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరును నమోదు చేయగలిగింది.

ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..!

ఇవి కూడా చదవండి

పేకమేడలా కూలిన భారత బ్యాటింగ్.. రికార్డు స్థాయిలో ఘోర అవమానం..

202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటింగ్‌ను ముక్కలు చేశారు. కేవలం పవర్‌ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా తీవ్ర కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలో భారత్ ఇన్ని వికెట్లు కోల్పోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. అభిషేక్ శర్మ, వైభవ్ ఆశలు రేపినా ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఒకరి తర్వాత ఒకరు బాధ్యతారాహిత్యంగా వికెట్లు పారేసుకోవడంతో భారత్ కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే ఆలౌట్ అయింది. జోష్ టంగ్ నాలుగు వికెట్లతో భారత్‌ను దెబ్బతీయగా, ఆర్చర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

రికార్డుల కెక్కన పరాజయాల పరంపర: శ్రేయాస్ కెప్టెన్సీపై ప్రశ్నలు

ఈ ఓటమితో టీమిండియా టీ20 చరిత్రలోనే పరుగుల పరంగా అత్యంత భారీ ఓటమిని నమోదు చేసి ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గతంలో 2019లో న్యూజిలాండ్‌పై 80 పరుగుల తేడాతో ఓడిపోవడమే ఇప్పటివరకు పెద్ద ఓటమిగా ఉండేది. కానీ ఇప్పుడు 125 పరుగుల తేడాతో ఓడిపోవడం అభిమానులను కలచివేస్తోంది. ప్రపంచకప్ విజయం తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ వరుసగా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయింది. శ్రేయాస్ కెప్టెన్సీలో ఆడిన గత 12 టీ20 మ్యాచ్‌ల్లో 10 ఓటములు చవిచూడటం అతని సారథ్య సామర్థ్యంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!

మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ తమ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉందని, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఘోరంగా విఫలమయ్యామని అంగీకరించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డ భారత్, తదుపరి జరగబోయే బ్రిస్టల్ మ్యాచ్‌లోనైనా పుంజుకుని పరువు నిలుపుకుంటుందో లేదో చూడాలి. ఆటగాళ్లు తమ బాధ్యతను గుర్తించకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని పరాజయాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us