IPL 2023: ఒక్కో పరుగుకు రూ. 10 లక్షలు.. ఐపీఎల్ 2023లో మిస్ ఫైర్‌గా మిగిలిన కోటీశ్వరుడు..
IPL 2023: మినీ వేలంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ను కోటి రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అయితే, అతడికి కేవలం 3 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం మాత్రమే ఇచ్చింది.

ఈసారి ఐపీఎల్‌లో టైటిల్ గెలిచే బలమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన రాజస్థాన్ రాయల్స్.. లీగ్‌లో తమ పోరాటానికి తెరపడి.. ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటికి చేరింది. జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నప్పటికీ రాజస్థాన్ ఈసారి కప్ గెలవలేకపోయింది. గతసారి ఫైనల్స్‌కు చేరిన రాజస్థాన్ ఈసారి ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించలేదు. విదేశీ ఆటగాళ్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. గతసారి సంచలనం సృష్టించిన బట్లర్ ఈసారి 5 మ్యాచ్ ల్లో జీరోకే తన వికెట్ పోగొట్టుకున్నాడు. Hetmayr కూడా విఫలమయ్యాడు.
బ్యాటింగ్ విభాగం స్టోరీ ఇలాగుంటే.. బౌలింగ్‌లో బౌల్ట్ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే గాయం సమస్య రాజస్థాన్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జంపా కూడా నిరాశే మిగిల్చాడు. ఈ నలుగురే కాకుండా రాజస్థాన్ జట్టులో ముఖ్యమైన విదేశీ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బెంచ్‌పై నిరీక్షించాల్సి వచ్చింది. వారిలో ప్రముఖుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్.
ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్‌ను ఫ్రాంచైజీ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అనుభవం, ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని రూట్‌కు రాజస్థాన్ జట్టు మరిన్ని అవకాశాలు ఇస్తుందని భావించారు. కానీ అది జరగలేదు.



ఐపీఎల్ తొలి అర్ధభాగంలో ఆడే అవకాశం రాని రూట్.. ఐపీఎల్ రెండో దశలో 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో అతనికి ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అందులో అతను కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.
జో రూట్ T20 కెరీర్ గురించి మాట్లాడితే, 32 T20 మ్యాచ్‌లలో 35.72 సగటు, 126.31 స్ట్రైక్ రేట్‌తో 893 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో రూట్ 6 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..