ENG vs AFG T20 WC: 6 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్- ఆఫ్ఘనిస్తాన్ పోరు.. టాస్ గెలిచిన బట్లర్ సేన..

ఈ గ్రూప్-1 మ్యాచ్‌లో పేపర్‌పై ఇంగ్లండ్ జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తోంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమదైన రోజున ఏ ప్రత్యర్థిని అయినా కలత చెందేలా చేస్తుంది. ఇరు జట్లు ఆరేళ్ల తర్వాత టీ20 ఫార్మాట్‌లో తలపడుతున్నాయి.

ENG vs AFG T20 WC: 6 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్- ఆఫ్ఘనిస్తాన్ పోరు.. టాస్ గెలిచిన బట్లర్ సేన..
Eng Vs Afg Playing 11
Follow us
Venkata Chari

|

Updated on: Oct 22, 2022 | 4:39 PM

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 రౌండ్‌ రెండో మ్యాచ్‌ శనివారం పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య జరుగుతోంది. ఈ గ్రూప్-1 మ్యాచ్‌లో పేపర్‌పై ఇంగ్లండ్ జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తోంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమదైన రోజున ఏ ప్రత్యర్థిని అయినా కలత చెందేలా చేస్తుంది. ఇరు జట్లు ఆరేళ్ల తర్వాత టీ20 ఫార్మాట్‌లో తలపడుతున్నాయి. దీనికి ముందు వీరి మధ్య చివరి మ్యాచ్ 2016లో జరిగింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆఫ్ఘన్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

టోర్నీ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ..

ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఫ్రంట్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత టీ20 ప్రపంచకప్ నుంచి ఇంగ్లిష్ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. కొత్త బాల్‌తో పాటు డెత్ ఓవర్లలో కూడా బాగా బౌలింగ్ చేయగట టాప్లీ లేకపోవడం, ఇంగ్లండ్ టీంకు తీవ్ర నష్టమే.

బ్యాటింగ్‌లో లియామ్ లివింగ్‌స్టన్ గాయపడడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అయితే, ప్రస్తుతం ఫిట్‌గా ఉండడంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘని, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మలిక్, ఫరీద్ అహ్మద్ మలిక్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్