AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇజ్జత్ తీసి ఇంటికి పంపిస్తాం.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..

Michael Vaughan comments: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఈ పరాభవం భారత జట్టుకు ఒక కనువిప్పు లాంటిది. అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే ఐర్లాండ్ జట్టు చూపిన పోరాట పటిమను చూసి భారత ఆటగాళ్లు బుద్ధి తెచ్చుకోవాలి. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనలోనైనా పాత తప్పులను సరిదిద్దుకుని, సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగకపోతే ఇంగ్లాండ్ గడ్డపై మరో ఘోర పరాజయం తప్పదు.

ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇజ్జత్ తీసి ఇంటికి పంపిస్తాం.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
Eng Vs Ind Michael Vaughan CommentsImage Credit source: AI Image
Venkata Chari
|

Updated on: Jun 29, 2026 | 4:39 PM

Share

Michael Vaughan Comments: వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచి చరిత్ర సృష్టించిన టీం ఇండియా, పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ అవమానకర ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు భారత్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అహంకారమే ముంచిందా? ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవం!

టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన గర్వమే టీం ఇండియా కొంపముంచిందా అంటే క్రికెట్ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఎంతో అనుభవం ఉన్న స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగినప్పటికీ, ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్ గెలవలేకపోయింది. ఈ ఘోర ఓటమిని భారత క్రికెట్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా భారత బ్యాటర్ల నిర్లక్ష్యపూరితమైన ఆటతీరే ఈ పరాజయానికి ప్రధాన కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు..

ఇవి కూడా చదవండి

కుప్పకూలిన టాప్ ఆర్డర్.. నిలబెట్టిన తిలక్ వర్మ..

రెండు మ్యాచ్‌ల్లోనూ భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 49 పరుగులతో రాణించకపోతే భారత్ మరింత తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేది. ఇక రెండో టి20లో 155 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారంటే బ్యాటర్ల బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ప్లేయర్లు చేతులెత్తేశారు. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ 55 పరుగులతో ఒంటరి పోరాటం చేయబట్టే కనీసం ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. లేదంటే భారత్ వంద పరుగుల లోపే కుప్పకూలిపోయేది. బౌలర్లు కొంతవరకు ఫర్వాలేదనిపించినా, బ్యాటర్ల వైఫల్యం జట్టును ముంచేసింది.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!

ఇంగ్లాండ్ మాజీల దారుణమైన వ్యాఖ్యలు.. నాసిర్ హుసేన్ రెచ్చగొట్టే మాటలు!

ఈ ఓటమిని ఆసరాగా చేసుకుని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు టీం ఇండియాపై దారుణమైన విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌కు చుక్కెదురు కావడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ స్పందిస్తూ, “గర్వంతో ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పిచ్‌ల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టే టీం ఇండియాను వణికించింది, ఇక బలమైన ఇంగ్లాండ్ గడ్డపై భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ అంతకంటే దారుణమైన ఓటములను చవిచూస్తారు” అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

ఇది కూడా చదవండి: టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!

కోచ్‌గా గంభీర్ ఫెయిల్.. మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

మరో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ నేరుగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను టార్గెట్ చేశాడు. ఈ సిరీస్ ఓటమికి గంభీర్ వైఫల్యమే కారణమని ఆయన స్పష్టం చేశాడు. “సూర్యకుమార్ యాదవ్ వల్ల టీ20 వరల్డ్ కప్, రోహిత్ శర్మ వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు కానీ, గంభీర్ వల్ల టీం ఇండియా ఏమీ గెలవలేదు. రాబోయే రోజుల్లో రికీ పాంటింగ్ లాంటి కోచ్ ఉంటేనే శ్రేయస్ అయ్యర్ జట్టుకు కలిసి వస్తుంది. లేదంటే ఇలాంటి అవమానకర ఓటములు మరిన్ని చూడాల్సి వస్తుంది.” అని వాన్ విమర్శించాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో యువ ఆటగాడు వైభవ్‌ను జట్టులోకి తీసుకుంటే ఫలితాలు మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక కెవిన్ పీటర్సన్ సైతం టీం ఇండియా నుంచి ఇలాంటి పేలవమైన ఆటతీరును అస్సలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా నటించింది.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా నటించింది.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...