ENG vs WI: వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ రికార్డులను సమం చేసిన విండీస్ డేంజరస్ ప్లేయర్.. అవేంటంటే?
ENG vs WI, Shai Hope: ఆంటిగ్వాలో వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. వెస్టిండీస్ తరుపున కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన షాయ్ హోప్ సెంచరీ చేయడమే కాకుండా ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 16వ వన్డే సెంచరీ పూర్తి చేసిన హోప్.. వన్డేల్లో 16 సెంచరీలు బాదిన 5వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ENG vs WI, Shai Hope: ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. వెస్టిండీస్ తరుపున కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన షాయ్ హోప్ సెంచరీ చేయడమే కాకుండా ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయ సెంచరీ సాధించిన షాయ్ హోప్ 83 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డే కెరీర్‌లో 5000 పరుగుల మార్కును కూడా దాటేశాడు.
దీంతోపాటు వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీల జాబితాలో షాయ్ హోప్ కూడా చేరాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లతో పాటు, హోప్ వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ 97 ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. రెండో స్థానంలో ఉన్న హషీమ్ ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల పరుగుల మార్క్‌ను దాటాడు.
మూడో స్థానంలో ఉన్న వివ్ రిచర్డ్స్, విరాట్ కోహ్లిలు 114 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిన షాయ్ హోప్ కూడా 114 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల పరుగులు పూర్తి చేశాడు.
దీంతో పాటు ఈ మ్యాచ్‌లో 16వ వన్డే సెంచరీ పూర్తి చేసిన హోప్.. వన్డేల్లో 16 సెంచరీలు బాదిన 5వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం 100 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న బాబర్ అజామ్, హషీమ్ ఆమ్లా వరుసగా 84, 94 వన్డేల్లో 16 వన్డే సెంచరీలు సాధించారు. వీరిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ నిలిచాడు.
View this post on Instagram
ఇరు జట్లు:
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, కీసీ కార్టీ, షాయ్ హోప్(కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, ఒషానే థామస్.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, బ్రైడన్ కార్సే, రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




