DPL 2024: ఎవడు మమ్మీ వీడు.! యువీకి తమ్ముడిలా.. 19 ఫోర్లు, 8 సిక్సర్లతో పెను బీభత్సం

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 23వ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ జట్టు కెప్టెన్ ఆయుష్ బడోని నార్త్ ఢిల్లీపై 300 స్ట్రైక్ రేట్‌తో కేవలం 55 బంతుల్లో 19 సిక్సర్లు, 8 ఫోర్లతో 165 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో బడోనీకి..

DPL 2024: ఎవడు మమ్మీ వీడు.! యువీకి తమ్ముడిలా.. 19 ఫోర్లు, 8 సిక్సర్లతో పెను బీభత్సం
Ayush Badoni
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 31, 2024 | 8:30 PM

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 23వ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ జట్టు కెప్టెన్ ఆయుష్ బడోని నార్త్ ఢిల్లీపై 300 స్ట్రైక్ రేట్‌తో కేవలం 55 బంతుల్లో 19 సిక్సర్లు, 8 ఫోర్లతో 165 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో బడోనీకి మంచి సహకారం అందించిన ఓపెనర్ ప్రియాంష్ ఆర్య కూడా అద్భుత సెంచరీ సాధించాడు. వీరిద్దరూ కలిసి సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ జట్టుకు 20 ఓవర్లలో 308 పరుగుల భారీ స్కోర్ అందించారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన ప్రియాంష్ ఆర్య, సార్థక్ రే తొలి వికెట్‌కు 13 పరుగులు మాత్రమే జోడించారు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ ఆయుష్ బదోనీ, ప్రియాంష్ ఆర్యతో కలిసి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చెమటలు పట్టించారు. ఆరంభం నుంచే వీరిద్దరూ దూకుడైన ఆటతీరుతో పరుగుల తుఫాను సృష్టించారు. బడోని ఈ లీగ్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా బడోని సూపర్ ఫాస్ట్‌గా 150 పరుగుల మార్కును దాటేశాడు. ఎట్టకేలకు బడోని 19వ ఓవర్‌లో తన వికెట్‌ను 165 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో బడోనితో పాటు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య కూడా సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య 50 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 240 స్ట్రైక్ రేట్‌తో 120 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ పేలుడు ఇన్నింగ్స్‌లో ప్రియాంష్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. నార్త్ ఢిల్లీ ఆటగాడు మనన్ భరద్వాజ్ వేసిన ఒకే ఓవర్లో ప్రియాంష్ ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ 12వ ఓవర్లో ప్రియాంష్ 6 సిక్సర్లు బాదాడు. దీంతో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అటు ఈ మ్యాచ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు వ్యక్తిగత సెంచరీలు సాధించడమే కాకుండా రెండో వికెట్‌కు 286 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇది చదవండి: ముంబై‌కి కొత్త కెప్టెన్‌గా టీ20 డైనమైట్.. హార్దిక్‌కు కూడా హ్యాండిచ్చేసిందిగా 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..