T20: 0,0,0,0,0,0.. వీడెవడో బుమ్రానే మించిపోయాడుగా.. 4 ఓవర్లకు ఎన్ని పరుగులిచ్చాడో తెల్సా
మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్ మ్యాచ్‌లో హాంకాంగ్, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మంగోలియా జట్టు కేవలం 17 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 క్రికెట్‌లో రెండో అత్యల్ప స్కోరు.
మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్ మ్యాచ్‌లో హాంకాంగ్, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మంగోలియా జట్టు కేవలం 17 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 క్రికెట్‌లో రెండో అత్యల్ప స్కోరు. అంతకన్నా ముందు మంగోలియా జట్టు మే 18, 2024న జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన మంగోలియా జట్టుకు తొలి ఓవర్ నుంచే షాకులు తగులుతూ వచ్చాయి. జట్టు మొత్తం 14.2 ఓవర్లు ఆడినా.. 20 పరుగులు కూడా చేయలేకపోయింది. మంగోలియాకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఖాతా తెరవలేకపోయారు. అలాగే ఏ బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు. మంగోలియా తరఫున మోహన్ వివేకానంద అత్యధికంగా 5 పరుగులు, ముగ్గురు ఆటగాళ్లు 2 పరుగులు, మరో ముగ్గురు ఆటగాళ్లు 1 పరుగు చొప్పున స్కోరు చేశారు. మంగోలియా జట్టు అత్యల్ప స్కోర్ చేయడంలో హాంకాంగ్ జట్టు పేసర్లు కీలక రోల్ ప్లే చేశారు. ఆ జట్టు తరఫున ఎహ్సాన్ ఖాన్ 3 ఓవర్లు వేసి 4 వికెట్లు తీయగా.. యాసిమ్ ముర్తజా, అనాస్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆయుష్ శుక్లా, అతిక్ ఇక్బాల్ చెరో వికెట్ తీశారు.
4 ఓవర్లు మెయిడిన్..
హాంకాంగ్ తరఫున ఆయుష్ శుక్లా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆయుష్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి పరుగులేమీ ఇవ్వలేదు. అంటే ఆయుష్ వేసిన నాలుగు ఓవర్లూ మెయిడిన్లే. నాలుగు ఓవర్ల మెయిడిన్లతో పాటు ఒక్క వికెట్ కూడా పడగొట్టాడు ఆయుష్. కాగా, మంగోలియా 17 పరుగుల అత్యల్ప స్కోరును హాంకాంగ్ జట్టు 9 వికెట్ల తేడాతో చేధించి విజయం సాధించింది.
ఇది చదవండి: ముంబైకి కొత్త కెప్టెన్‌గా టీ20 డైనమైట్.. హార్దిక్‌కు కూడా హ్యాండిచ్చేసిందిగా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..