AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: కోహ్లీ, రోహిత్‌లకు పోటీ ఇచ్చినా ఒక్క ఐసీసీ కప్పు లేని క్రికెటర్.. టీమిండియాలో అన్ లక్కీ ప్లేయర్ అతనే

క్రికెటర్లు ఎన్ని పరుగులు చేసినా, వికెట్లు తీసినా.. వారి ఖాతాలో ఎన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయన్నదే క్రికెట్ అభిమానులు చూస్తారు. గతంలో భారత్ తరఫున పరుగుల వర్షం కురిపించిన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ కనీసం ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేకపోయారు. అలాగే టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ ఆరో ప్రపంచకప్ లో కానీ వరల్డ్ కప్ ను ముద్దాడ లేకపోయాడు

Team India: కోహ్లీ, రోహిత్‌లకు పోటీ ఇచ్చినా ఒక్క ఐసీసీ కప్పు లేని క్రికెటర్.. టీమిండియాలో అన్ లక్కీ ప్లేయర్ అతనే
Team India
Basha Shek
|

Updated on: Jul 02, 2024 | 8:20 PM

Share

క్రికెటర్లు ఎన్ని పరుగులు చేసినా, వికెట్లు తీసినా.. వారి ఖాతాలో ఎన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయన్నదే క్రికెట్ అభిమానులు చూస్తారు. గతంలో భారత్ తరఫున పరుగుల వర్షం కురిపించిన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ కనీసం ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేకపోయారు. అలాగే టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ ఆరో ప్రపంచకప్ లో కానీ వరల్డ్ కప్ ను ముద్దాడ లేకపోయాడు. విరాట్ కోహ్లీ 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ అందుకున్నాడు. రోహిత్ శర్మ కూడా ఇటీవలే కెప్టెన్ గా పొట్టి ఫార్మాట్ లో ఐసీసీ కప్పును అందుకున్నాడు. అయితే కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మలకు గట్టి పోటీని ఇచ్చి కనీసం ఒక్క ఐసీసీ కప్పు కూడా అందుకోలేని ది మోస్ట్ అన్ లక్కీ ప్లేయర్ మరొకరు ఉన్నారు. అతనే కేఎల్ రాహుల్. వన్డే వరల్డ్ కప్‌ తో పాటు, ఐపీఎల్ లోనూ పరుగుల వర్షం కురిపించిన అతను టీ20 ప్రపంచకప్ లో ఆడలేకపోయాడు. అంతకు ముందు 2023 ప్రపంచకప్ లో ఆడినా దురదృష్టవశాత్తూ ఫైనల్ లో భారత్ ఓటమి చవి చూసింది.

టీమిండియాకు చాలా ఏళ్లుగా వైస్ కెప్టెన్ గా సేవలందించిన కేఎల్ రాహుల్ వన్డే వరల్డ్‌ కప్‌ 2023, టీ20 వరల్డ్‌ కప్‌ 2022, 2021, వన్డే వరల్డ్‌ కప్‌ 2019 టీమ్స్‌లో ఆడాడు. ఆటగాడిగా అమోఘంగా రాణించాడు. కానీ భారత జట్టు ప్రపంచకప్ గెలవలేకపోయింది. ఇక ట్యాలెంట్, టెక్నిక్ విషయంలో కోహ్లీ, రోహిత్ లకు కేఎల్ రాహుల్ ఏ మాత్రం తక్కువ కాడు. భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వర్షం కురిపించాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే దురదృష్టం కూడా రాహుల్ ను వెంటాడుతోంది. అందుకే 2014 నుంచి సుమారు పదేళ్లుగా భారత జట్టులో ఆడుతున్నా ఒక ఐసీసీ కప్ కూడా గెలవలేకపోయాడు. భారత జట్టు వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. మరి దీంతోనైనా కేఎల్ రాహుల్ ఐసీసీ కప్ కల సాకారం చేసుకుంటాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పైనే కే ఎల్ రాహుల్ దృష్టి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్