AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs LSG: కోహ్లీతోనే మైండ్‌ గేమ్స్‌ ఆడిన సంతకాల స్టార్‌! నిన్నటి మ్యాచ్‌లో హైలెట్‌ సీన్‌ అంటే ఇదే..

ఐపీఎల్‌లో దిగ్వేష్ సింగ్‌ రఠీ తన ప్రత్యేకమైన సెలబ్రేషన్స్‌తో పాపులర్ అయ్యాడు. కోహ్లీతో జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌలింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీని ఉద్దేశించి చేసిన చర్య మైండ్ గేమ్స్‌ అని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు గౌరవంగా భావిస్తున్నారు.

RCB vs LSG: కోహ్లీతోనే మైండ్‌ గేమ్స్‌ ఆడిన సంతకాల స్టార్‌! నిన్నటి మ్యాచ్‌లో హైలెట్‌ సీన్‌ అంటే ఇదే..
Digvesh Rathi Vs Virat Kohl
SN Pasha
|

Updated on: May 28, 2025 | 12:05 PM

Share

ఐపీఎల్‌లో సంతకాల స్టార్‌, సైనింగ్‌ స్టార్ ఎవరంటే..? లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ దిగ్వేష్ సింగ్ రఠీ అని ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. తన ప్రదర్శన కంటే కూడా తన సంతకాల సెలబ్రేషన్స్‌, ఫైన్స్‌తోనే అతను ఎక్కువ ఫేమస్‌ అయ్యాడు. అఫ్‌కోర్స్‌ బౌలింగ్‌ కూడా చాలా బాగా వేశాడు. కానీ, సైనింగ్‌ సెలబ్రేషన్స్‌, అభిషేక్‌ శర్మతో గొడవ, ఒక మ్యాచ్‌ నిషేధంతో రఠీ పేరు మారమోగిపోయింది. తనకొచ్చిన ఐపీఎల్‌ ప్రైజ్‌ కంటే కూడా ఫైన్‌ ఎక్కువ కట్టాడంటూ అతనిపై జోకులు కూడా బాగానే పేలాయి. ఈ ప్లేయర్‌ మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా తన స్లెడ్జింగ్‌ స్కిల్స్‌ చూపించే ప్రయత్నం చేశాడు. అది కూడా విరాట్‌ కోహ్లీ ముందు.

ఆర్సీబీ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో అప్పటికే కోహ్లీ హాఫ్‌ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నాడు. సరిగ్గా అదే టైమ్‌లో బౌలింగ్‌ వేసేందుకు వచ్చిన దిగ్వేష్‌.. బౌలింగ్‌ వేస్తూ సరిగ్గా బాల్‌ రిలీజ్‌ చేసే టైమ్‌లో ఆగిపోయాడు. కోహ్ల అలాగే చూస్తూ నిల్చుండి పోయాడు. దిగ్వేష్‌ కూడా కోహ్లీ కళ్లలోకి సీరియస్‌గా చూసే ప్రయత్నం చేశాడు. కానీ, అక్కడుంది కోహ్లీని తేరుకొని.. లేదు లేదు.. అక్కడేదో తనను డిస్టబ్‌ చేసినట్లు కవర్‌ చేశాడు. దానికి కోహ్లీ నవ్వేయడంతో అంతా హమ్మయ్యా అనుకున్నారు. నిజానికి కోహ్లీ కాన్సట్రేషన్‌ను దెబ్బతీసేందుకు దిగ్వేష్‌ మైండ్‌ గేమ్స్‌ ఆడినట్లు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

కానీ, కొన్ని రోజుల క్రితం అందరితో చేసినట్లే కోహ్లీతో కూడా ఇలానే చేస్తావా అని ఓ ఇంటర్వ్యూలో దిగ్వేష్‌ను అడగ్గా.. చేయని అని తల అడ్డంగా ఊపాడు. అది కోహ్లీకి తనకున్న భయమో, గౌరవమో తెలియదు కానీ.. ఆర్సీబీపై దిగ్వేష్‌ ఎలాంటి అతి చేయలేదు. జితేష్‌ శర్మను అవుట్‌ చేసి నేలపై సంతకం చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నప్పటికీ అది నో బాల్‌ కావడంతో.. చెక్‌ బౌన్స్‌ అయిందంటూ అంత దిగ్వేష్‌ను సరదాగా ట్రోల్‌ చేశారు. అయితే.. కోహ్లీతో జరిగిన ఈ చిన్న సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..