T20 Cricket: టీ20 క్రికెట్‌ ఆడని టీమిండియా దిగ్గజ క్రికెటర్లు వీరే.. లిస్టులో ఎవరూ ఊహించని పేరు

ఇప్పుడు T20 క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెస్టు, వన్డే ఫార్మాట్‌ల కంటే టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లనే అభిమానులు ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2006లో ప్రారంభమైన T20 ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లు, T20 లీగ్, ICC ప్రపంచకప్‌ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.. అయితేకొందరు భారత దిగ్గజ ఆటగాళ్లు ఇప్పటి వరకు టీ20 క్రికెట్ ఆడలేదు.

T20 Cricket: టీ20 క్రికెట్‌ ఆడని టీమిండియా దిగ్గజ క్రికెటర్లు వీరే.. లిస్టులో ఎవరూ ఊహించని పేరు
T20I Cricket

Updated on: Feb 20, 2024 | 12:09 PM

ఇప్పుడు T20 క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెస్టు, వన్డే ఫార్మాట్‌ల కంటే టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లనే అభిమానులు ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2006లో ప్రారంభమైన T20 ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లు, T20 లీగ్, ICC ప్రపంచకప్‌ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.. అయితేకొందరు భారత దిగ్గజ ఆటగాళ్లు ఇప్పటి వరకు టీ20 క్రికెట్ ఆడలేదు. వారెవరో తెలుసుకుందాం రండి. బెంగాల్‌ టైగర్‌ సౌరవ్‌ గంగూలీ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. కానీ ఎప్పుడూ టీ20 క్యాప్ ధరించలేదు. భారత్ తన తొలి టీ20 ఆడిన రెండేళ్ల తర్వాత 2008లో గంగూలీ రిటైరయ్యాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడని సీనియర్ ఆటగాళ్లలో గంగూలీ కూడా ఒకడు. గంగూలీ భారత్ తరఫున టీ20 ఆడలేదు కానీ ఐపీఎల్ ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా గంగూలీ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత పూణే వారియర్స్‌కు నాయకత్వం వహించాడు. అలాగే మెంటార్ గా సేవలందిస్తున్నాడు . ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంఛైజీలో కీ రోల్‌ పోషిస్తున్నాడీ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్.

ఛెతేశ్వర్ పుజారా T20I క్రికెట్ ఆడని మరొక భారతీయ దిగ్గజం. అతను ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడు. అయితే అది కేవలం టెస్టుల్లోనే. ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి కూడా పూజారాను తప్పించారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భతంగా ఆడుతోన్న ఈ వాల్ ను త్వరలోనే మళ్లీ టీమిండియా టెస్టు జట్టులో చూడొచ్చు. పుజారా గతంలో ఐపీఎల్ ఆడాడు . 2021లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు కూడా. CSK కాకుండా, అతను కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించాడు పుజారా.

ఇవి కూడా చదవండి

ఇక హైదరాబాదీ క్రికెటర్‌ వీవీఎస్ లక్ష్మణ్ 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. కానీ ఎప్పుడూ టీ20 ఆడలేదు. భారత దిగ్గజం 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. అతను 2006లో తన చివరి ODI ఆడాడు. ఆ తరువాత టెస్టులకే పరిమితమయ్యాడు. లక్ష్మణ్ టెస్టుల్లో 8781 పరుగులు, వన్డేల్లో 2338 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు భారత దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్‌కు షాక్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. డెక్కన్ ఛార్జర్స్, కొచ్చి టస్కర్స్ జట్ల తరపున లక్ష్మణ్ ఐపిఎల్‌లో ప్రాతినిధ్యం వహించాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..