IPL 2022: విరాట్ కోహ్లీని ఎంఎస్ ధోనీ దాటేస్తాడా.. అభిమానులు ఏమనుకుంటున్నారు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్ మరో 9 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్‌లో జట్లను, ఆటగాళ్లను అభిమానులు అంచనా వేస్తున్నారు...

IPL 2022: విరాట్ కోహ్లీని ఎంఎస్ ధోనీ దాటేస్తాడా.. అభిమానులు ఏమనుకుంటున్నారు..
Ms Dhoni
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 17, 2022 | 5:12 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్ మరో 9 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్‌లో జట్లను, ఆటగాళ్లను అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇతను బాగా ఆడతాడు, అతను వికెట్లు పడగొడతారంటూ ట్విట్టర్‌లో వారి అంచనాలను పోస్ట్ చేస్తున్నారు. అయితే చాలా మంది మిస్టర్‌ కూల్ ఎంఎస్‌ ధోనీ గురించే మాట్లాడుకుంటున్నారటా.. 40 ఏళ్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసి తన కెరిర్‌ను ముగిస్తాడని చెబుతున్నారు. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్‌ గెలుచుకున్నా.. MS ధోని పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. 16 మ్యాచ్‌లు ఆడిన ధోని అత్యధిక సింగిల్-ఇన్నింగ్స్ స్కోరు 18*. అతను సగటు 16.28 , అతని స్ట్రైక్ రేట్ కూడా తగ్గింది. మొత్తం సీజన్‌లో ధోనీ 114 పరుగులు చేశాడు. మరోవైపు, కోహ్లీ 15 మ్యాచ్‌లు ఆడాడు. 28.92 సగటుతో 405 పరుగులు, 119.46 స్ట్రైక్ రేట్ ఉన్నాడు.

ధోనీ అతని జట్టుకు సాంప్రదాయ ఫినిషర్, నంబర్ 6, నంబర్ 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత ముందుకు వచ్చి దేవదత్ పడిక్కల్‌తో కలిసి RCB ఇన్నింగ్స్‌ను తెరవాలని నిర్ణయించుకున్నాడు. పిచ్‌పై ధోనీ 107 బంతులు మాత్రమే ఎదుర్కొనగా, కోహ్లీ క్రీజులో 339 బంతులు ఎదుర్కొన్నాడు. కోహ్లికి తన సామర్థ్యాల మేరకు ఎలా రాణించాలో ఖచ్చితంగా తెలుసు. అందువల్ల, రెగ్యులర్ సీజన్ ముగిసే సమయానికి ధోని కోహ్లీ కంటే ఎక్కువ స్కోర్ చేయాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాల్సి ఉంటుంది.

Read Also.. IPL 2022: మయాంక్ అగర్వాల్‌తో బ్యాంటింగ్ ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా.. ఈసారి విజయం మాదే..