Dhoni vs Virat vs Rohit: ఈ ముగ్గురిలో మేటి ఆటగాడు ఎవరు..? వీరేంద్ర సెహ్వాగ్ ఛాయిస్ ఎవరంటే..
This or That Challenge: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఛాలెంజ్ 'దిస్ ఆర్ దట్' (This or That). ఇందులో భాగంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఇద్దరు లేదా ముగ్గురు ప్రముఖుల పేర్లను సూచించి వీరిలో ఒకరిని ఎంచుకోవాలని సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలను కోరుతారు. వారిలో ఒకరిని సెలబ్రిటీలు ఎంచుకుంటారు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నమెంట్‌లో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఛాలెంజ్ ‘దిస్ ఆర్ దట్’ (This or That). ఇందులో భాగంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఇద్దరు లేదా ముగ్గురు ప్రముఖుల పేర్లను సూచించి వీరిలో ఒకరిని ఎంచుకోవాలని సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలను కోరుతారు. వారిలో ఒకరిని సెలబ్రిటీలు ఎంచుకుంటారు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నమెంట్‌లో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలో మేటి ఆటగాడు ఎవరన్న క్లిష్టమైన ప్రశ్న వీరేంద్ర సెహ్వాగ్‌కు ఎదురయ్యింది. అయితే ఏ మాత్రం తటపటాయించకుండా వీరిలో రోహిత్ శర్మ తన ఛాయిస్‌గా సెహ్వాగ్ తెలిపాడు. అలాగే ఎంఎస్ ధోనీ, బెన్ స్టోక్స్ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు.. ఎంఎస్ ధోనీ అని వీరూ రిప్లై చేశాడు.
అదే సమయంలో ఎంఎస్ ధోనీ, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారని ఛాలెంజ్‌కు.. డివిలియర్స్ అని సెహ్వాగ్ సమాధానమిచ్చాడు. అలాగే విరాట్ కోహ్లీ, డివిలియర్స్ ఇద్దరిలో కోహ్లీ వైపే మొగ్గుచూపాడు. అలాగే రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరిలో రోహిత్ శర్మనే సెహ్వాగ్ ఎంచుకున్నారు. అలాగే డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ ఇద్దరిలో రోహిత్ శర్మ.. డేయిల్ స్టెయిన్, రోహిత్ శర్మ ఇద్దరిలోనూ రోహిత్ శర్మకే సెహ్వాగ్ ఓటువేశారు. ఇతర ఆటగాళ్లతో రోహిత్ శర్మను పోల్చినప్పుడు.. అన్నిసార్లు సెహ్వాగ్ హిట్ మ్యాన్ వైపే మొగ్గుచూపడం విశేషం.
దిస్ ఆర్ దట్ ఛాలెంజ్‌ను ఎదుర్కొన్న వీరేంద్ర సెహ్వాగ్
Legend Virender Sehwag knows who the real GOAT is 🥴🔥@ImRo45 🐐🔥
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 9, 2024
సెహ్వాగ్‌తో నిర్వహించిన దిస్ ఆర్ దట్ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో క్లిష్టమైన ప్రశ్నకు సెహ్వాగ్ కుండబద్ధలుకొట్టినట్లు సమాధానంచెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మరిన్ని క్రికెట్ కథనాలు చదవండి