Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితికి ఆ యంగ్ ప్లేయరే కారణం.. కోచ్ కీలక వ్యాఖ్యలు..

IPL 2023: ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన చాలా పేలవంగా తయారైంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున ఏ బ్యాట్స్‌మెన్ కూడా బ్యాటింగ్ చేయలేదు.

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితికి ఆ యంగ్ ప్లేయరే కారణం.. కోచ్ కీలక వ్యాఖ్యలు..
Dc
Follow us
Venkata Chari

|

Updated on: May 19, 2023 | 8:54 PM

Prithvi Shaw: ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన చాలా పేలవంగా తయారైంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున ఏ బ్యాట్స్‌మెన్ కూడా బ్యాటింగ్ చేయలేదు. గత ఏడాది డిసెంబర్ 30న జట్టు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడటంతో ఈ సీజన్‌లో ఆడడంలేదు. అటువంటి పరిస్థితిలో, యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా నుంచి, ఆ టీం భారీగా ఆశించింది. కానీ, ఈ యంగ్ బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలమయ్యాడు. షా వైఫల్యం వల్లే ఢిల్లీ నష్టపోయిందని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ షేన్ వాట్సన్ కూడా అంగీకరించాడు.

షా చాలా ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచాడు. కానీ, ఈ బ్యాట్స్‌మెన్ తన సత్తాకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడం కనిపించలేదు. షా నిరంతరం విఫలమవుతున్నాడు. అందువల్ల జట్టు అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా తొలగించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అతనికి మరోసారి అవకాశం లభించింది. ఇందులో షా హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది.

ఇవి కూడా చదవండి

నిరాశపరిచిన షా..

ఢిల్లీ తన తదుపరి మ్యాచ్‌ని సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు, జట్టు బ్యాటింగ్ కోచ్ వాట్సన్ ఈ సీజన్‌లో జట్టుకు అతిపెద్ద నిరాశ పృథ్వీ షా ఫాంలేమి అని అంగీకరించాడు. షా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని, అతను ఎలాంటి బౌలింగ్ దాడిని అయినా నాశనం చేయగలడని వాట్సన్ చెప్పుకొచ్చాడు. టీమ్ మేనేజ్‌మెంట్ తనకు పుష్కలంగా అవకాశాలు ఇచ్చిందని, తాను ఎలా ఆడాలనుకుంటున్నాడో అలా ఆడేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని వాట్సన్ పేర్కొన్నాడు.

షా కెరీర్..

ఈ ఏడాది ఏడు మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 101 పరుగులు మాత్రమే చేశాడు. గత మ్యాచ్‌లో షా 54 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ రాకపోతే షా స్కోరు 100 దాటి ఉండేది కాదు. ఈ కాలంలో షా సగటు 14.43. అతని స్ట్రైక్ రేట్ 129.49గా నిలుస్తుంది. గత సీజన్‌లో షా 10 మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేశాడు. ఈ సీజన్ షాకు చాలా బ్యాడ్‌గా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడి తక్కువ పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..