AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abu Dhabi T10 League: అబుదాబీ టీమ్‌పై డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం..77 పరుగులతో విజృంభించిన నికోలస్

డెక్కన్ గ్లాడియేటర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ రెండో బంతికే విల్ స్మీద్‌ను నవీన్ ఉల్ హక్ క్లీన్ బౌల్డ్ చేయడంతో గ్లాడియేటర్స్ ఆరంభంలోనే..

Abu Dhabi T10 League: అబుదాబీ టీమ్‌పై డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం..77 పరుగులతో విజృంభించిన నికోలస్
Deccan Gladiators Vs Team A
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 24, 2022 | 9:37 AM

Share

అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ యంగ్ ప్లేయర్ నికోలస్ పూరన్ 8 సిక్సర్లు, 5 బౌండరీలతో అజేయంగా 77 పరుగులు చేసి డెక్కన్ గ్లాడియేటర్స్‌కు బంపర్ ఆఫర్‌లా విజయాన్ని అందించాడు. మొదట బ్యాంటింగ్ దిగిన గ్లాడియేటర్స్ 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఆ జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని చేధించడంలో అబుదాబి జట్టు  విఫలమై 6 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. అబుదాబి జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన అబుదాబి టీ10 మొదటి రోజు మ్యాచ్‌లో..డెక్కన్ గ్లాడియేటర్స్ 35 పరుగుల తేడాతో అబుదాబి జట్టుపై విజయం సాధించింది.

డెక్కన్ గ్లాడియేటర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ రెండో బంతికే విల్ స్మీద్‌ను నవీన్ ఉల్ హక్ క్లీన్ బౌల్డ్ చేయడంతో గ్లాడియేటర్స్ ఆరంభంలోనే ఒక వికెట్ కోల్పోయారు. ఓపెనర్ నికోలస్ పూరన్ దూకుడుగా నవీన్ ఉల్ హక్ వేసిన ఐదు,  ఆరో బంతులను సిక్సర్ల కోసం కొట్టడం ప్రారంభించాడు. అలా తొలి ఓవర్ నుంచే తన దూకుడును ప్రారంభించిన పూరన. కానీ ఆరో ఓవర్‌లో బ్యాట్స్‌మెన్ ఎలాంటి బౌండరీలు లేదా సిక్స్‌లు కొట్టడానికి హ్యాట్జోగ్లో అవకాశం ఇవ్వలేదు. తొమ్మిదో ఓవర్లో పూరన్ తన దూకుడుతో ముస్తాఫిజుర్‌ బౌలింగ్2లో మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు కొట్టి.. ఆ ఓవర్‌లో 27 పరుగులు చేశాడు. అలా పూరన్ వెనకడుగు వేయకుండా ఆడడంతో.. డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

తరువాత అబుదాబి తన ఇన్నింగ్స్‌ను చాలా నెమ్మదిగా ప్రారంభించింది. సగం ఆట ముగిసేసరికి టీమ్ అబుదాబి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఆ సమయంలో ఆ జట్టుకు భారీ షాట్లు అవసరమయ్యాయి. ఆరో ఓవర్‌లో ఫాబియన్ అలెన్ వరుసగా రెండు బౌండరీలు కొట్టడంతో.. మిగిలిన 24 బంతుల్లో 63 పరుగులుగా టార్గెట్ ఉంది. క్రమక్రమంగా టీమ్ టార్గెట్ 12 బంతుల్లో 50 పరుగులకు చేరింది. కానీ డెక్కన్ గ్లాడియేటర్స్ బౌలింగ్ దాటికి తట్టుకోలేకపోయిన అబుదాబి జట్టు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 99 పరుగులకే చేయగలిగింది. ఫలితంగా అతిథ్య జట్టుపై డెక్కన్ గ్లాడియేటర్స్ మొదటి విజయాన్ని తన సొంతం చేసుకుంది.

స్కోర్లు వివరాలు.. డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134  చేసింది.

బ్యాటింగ్: నికోలస్ పూరన్ 77 నాటౌట్, ఒడియన్ స్మిత్ 23     బౌలింగ్: పీటర్ హట్జోగ్లో 12-2, ఫాబియన్ అలెన్ 18-2.

అబుదాబి జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 99 మాత్రమే చేయగలిగింది.

బ్యాటింగ్: జేమ్స్ విన్సీ 37, విన్స్ 37     బౌలింగ్: జహూర్ ఖాన్ 21-2, టామ్ హెల్మ్ 11-2)

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: నికోలస్ పూరన్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..