Nara Lokesh Tweet: ఏపీ సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన లోకేష్.. తల్లిని గౌరవించనివాడంటూ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనే పేరుకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనే పేరుకు కొత్త అర్థాలు చెప్తూ ట్వీట్ చేశారు లోకేష్. సీఎం జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, వెన్నుపోటుదారు అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు ఆయన. ఈ మేరకు బుధవారం రాత్రి లోకేష్ రెండు వరుస ట్వీట్లు చేశారు.
లొోకేష్ తన ట్వీట్‌లో.. ‘‘తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాడిని జగన్ రెడ్డి అంటాం. శివ కుమార్ పెట్టిన పార్టీని కబ్జా చేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. సొంత చెల్లిని గెంటేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. తల్లిని గౌరవించని వాడిని జగన్ రెడ్డి అంటాం’’ ’ అని రాసుకొచ్చారు. అలాగే తన రెండవ ట్వీట్‌లో ‘‘ బాబాయ్ పై గొడ్డలి వేటు వేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. లక్ష కోట్లు మింగి 16 నెలలు చిప్పకూడు తిన్న వాడిని రాక్షసుడు జగన్ రెడ్డి అంటాం. నలుగురు రెడ్లతో కూడిన జగన్ గ్యాంగ్, వీరికి మద్దతుగా వున్న బ్లూ మీడియాని దండుపాళ్యం బ్యాచ్ అంటాం’’ అని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాడిని జగన్ రెడ్డి అంటాం. శివ కుమార్ పెట్టిన పార్టీని కబ్జా చేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. సొంత చెల్లిని గెంటేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. తల్లిని గౌరవించని వాడిని జగన్ రెడ్డి అంటాం.(1/2)
— Lokesh Nara (@naralokesh) November 23, 2022
కాగా, చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్రను నారా లోకేష్ చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి 27వ తేదీన కుప్పంలో తొలి అడుగు వేయనున్నారు నారా లోకేష్. దీనికోసం ఆయన సన్నద్ధమవుతోన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..