AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: 1,408 పరుగులు, 8 సెంచరీలు.. దుమ్మురేపిన ధోని శిష్యులు.. మినీ వేలంలో ఫ్రాంచైజీలు గురి..

భారత దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2022లో ఇద్దరు ప్లేయర్స్ సెంచరీల మోత మోగిస్తున్నారు. ఒక ఆటగాడు ఇప్పటికే వరుసగా 5 శతకాలు..

IPL 2023: 1,408 పరుగులు, 8 సెంచరీలు.. దుమ్మురేపిన ధోని శిష్యులు.. మినీ వేలంలో ఫ్రాంచైజీలు గురి..
Chennai Super Kings
Ravi Kiran
|

Updated on: Nov 24, 2022 | 8:39 AM

Share

ప్రస్తుతం జరుగుతోన్న భారత దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2022లో ఇద్దరు ప్లేయర్స్ సెంచరీల మోత మోగిస్తున్నారు. ఒక ఆటగాడు ఇప్పటికే వరుసగా 5 శతకాలు.. అందులో ఓ డబుల్ సెంచరీ చేయగా.. ఇంకొకరు 3 శతకాలు బాదేశాడు. ఈ ఇద్దరూ కూడా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు.. ధోని శిష్యులు కూడా. మరి ఆ ఇద్దరూ ఎవరనుకుంటున్నారా.? మరెవరో కాదు నారాయణ్ జగదీషన్, సాయి సుదర్శన్.

వీరిద్దరూ కూడా పూనకం వచ్చిన ఆటగాళ్ల మాదిరిగా సెంచరీల మీద సెంచరీలు బాదేశారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2022 ఆడిన ఈ ఇద్దరినీ సీఎస్‌కే ఫ్రాంచైజీ.. మినీ వేలానికి ముందు వదులుకుంది. బహుశా ఈ అవమానం వారిలో కసి పెంచింది. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఆటతీరు కనబరిచేలా చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జగదీషన్ 7 మ్యాచ్‌ల్లో 5 భారీ సెంచరీలతో 822 పరుగులు చేయగా.. సుదర్శన్ అదే 7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలతో 586 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, జగదీషన్ కొనసాగిస్తున్న ప్రస్తుతం ఫామ్ దృష్ట్యా.. అతడు మినీ వేలంలో కోట్లు పలుకుతాడని అందరూ భావిస్తున్నారు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతున్న సాయి సుదర్శన్‌తో మరో కొందరు యువ ప్లేయర్స్ ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Csk