Watch Video: షర్ట్ లేకుండా వీడియో షేర్ చేసిన విరాట్.. ఆ రహస్యమేంటో చెప్పమంటోన్న నెటిజన్స్..
Virat Kohli Fitness:సెలవులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి మరోసారి కసరత్తులు ప్రారంభించాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహాలు ప్రారంభించాడు.
క్రికెట్ రారాజుగా పిలుచుకునే విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. దీనికి కారణం గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వీడియోతో సంచలనంగా మారాడు. విరాట్ కోహ్లీ జిమ్‌లో వర్కౌట్ చేసిన వీడియోను తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోని చూసిన కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లి జిమ్‌లో వర్కవుట్ చేస్తూ టీ షర్ట్ తీసేసి, ఆపై కనిపించిన దృశ్యం నిజంగా షాకింగ్‌గా అనిపిస్తుంది.
ఇటీవల ఉత్తరాఖండ్‌కు విహారయాత్రకు వెళ్లిన విరాట్ కోహ్లి ప్రస్తుతం మళ్లీ శిక్షణకు వచ్చాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లు జరగనుండగా, దాని కోసమే విరాట్ సన్నాహాలు ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ జిమ్‌లో చాలా కష్టపడుతున్నాడు. మొదట రన్నింగ్ చేసి ఆ తర్వాత అప్పర్ బ్యాక్ మజిల్స్ వర్కవుట్ చేస్తూ కనిపించాడు.
షర్ట్ లేకుండా విరాట్ కోహ్లీ..
విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, అతను అప్పర్ బ్యాక్ వర్కౌట్ చేస్తున్నాడు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీచాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఇలాంటి శరీరం కోసం చాలా సంవత్సరాలుగా కృషి చేస్తున్నాడు. అందుకోసమే జిమ్‌లో చెమటలు కక్కిస్తుంటాడు. అలాగే తీసుకునే ఆహారంలోనూ ఎంతో ప్లాన్డ్‌గా ఉంటాడు.
విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా ఫుల్ డైట్‌లో ఉంటున్నాడు. అతను చాలా ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించాడు. విరాట్ తీసుకునే ఫుడ్‌లో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉండటానికి ఇదే కారణం. కఠిన వ్యాయామం, ఆహారం కారణంగా విరాట్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంటుంది. అందుకే అతను మైదానంలోకి వచ్చినప్పుడల్లా పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. వికెట్ల మధ్యలోనూ వేగంగా పరిగెత్తుతుంటాడు.
View this post on Instagram
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ ఆధిపత్యం..
టీ20 వరల్డ్ కప్ 2022లో , టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకోకపోయినా, విరాట్ కోహ్లీ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 6 ఇన్నింగ్స్‌లలో 296 పరుగులు చేశాడు. విరాట్ సగటు 98 కంటే ఎక్కువగా ఉంది. అతని బ్యాట్ నుంచి 4 అర్ధ సెంచరీలు కూడా వచ్చాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ మళ్లీ బంగ్లాదేశ్‌పై రంగంలోకి దిగనున్నాడు. విరాట్ ఫామ్ అలాగే ఉంటుందని అంతా భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..