Watch Video: రిటైర్మెంట్ బాటలో టీమిండియా స్టార్ ప్లేయర్.. ఇన్‌స్టా వీడియోతో హింట్?
ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నన ఈ భారత స్టార్ ప్లేయర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్ పోస్‌తో అభిమానులకు అయోమయంలో పడేశాడు. రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడనే వార్తలకు మరింత ఊతమిచ్చాడని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2022 దినేష్ కార్తీక్‌కు ప్రత్యేకమైనది కాదు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌పై టీమిండియా పెట్టుకున్న అంచనాలు నెరవేరలేదు. ప్రపంచకప్‌నకు ముందు నుంచే కార్తీక్‌కు ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చని చెబుతున్నారు. ఈమేరకు కార్తీక్ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు. దీంతో అతని రిటైర్మెంట్ వార్తలకు మరింత బలం చేకూరిందని అంతా అనుకుంటున్నారు. అయితే, ఈ పోస్టులో తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పలేదు. కానీ, అభిమానులు మాత్రం అతని పోస్ట్‌ను బట్టి అసలు విషయం ఇదే అనుకుంటున్నారు.
ప్రపంచకప్‌లో ప్రారంభ మ్యాచ్‌లలో దినేష్ కార్తీక్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించింది. అయితే, అతని బ్యాట్ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత, ఇంగ్లండ్‌తో జరిగే ముఖ్యమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతని స్థానంలో రిషబ్ పంత్‌ని ప్లేయింగ్ 11లో చేర్చారు. ప్రస్తుతం కార్తీక్ వయసు 37 ఏళ్లు. వచ్చే ప్రపంచకప్‌లో ఆడతాడనే ఆశ అయితే లేదు. దీంతోనే ఇక కార్తీక్ రిటైర్మెంట్ సూచనలు కూడా ఇచ్చాడని భావిస్తున్నారు.
కార్తీక్ ప్రత్యేక వీడియో..
View this post on Instagram
కార్తీక్ తన జట్టు ఆటగాళ్లతో, కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలతోపాటు మైదానంలో ఆడుతున్న చిత్రాలతో కూడిన ఓ వీడియోను పంచుకున్నాడు. దినేష్ కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో క్యాప్షన్‌లో- డ్రీమ్ డూ కమ్ ట్రూ (కలలు నిజమవుతాయి) టీ20 ప్రపంచ కప్ అంటూ రాసుకొచ్చాడు. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో భాగం కావడం గర్వించదగ్గ విషయం. మనం టోర్నీని గెలవకపోవచ్చు కానీ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడూ సంతోషపరుస్తాయి. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
రెండు దశాబ్దాల కెరీర్..
దినేష్ కార్తీక్ 2004లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా అతను టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. ధోనీ ఉండగా భారత జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, గత కొన్నేళ్లుగా అతను జట్టులో పునరాగమనం చేయగలిగాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో తొలుత జట్టులో భాగమైన అతడు ఆ తర్వాత గతేడాది కూడా టీ20 ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకున్నాడు. కార్తీక్ ఇప్పుడు ఇద్దరు కొడుకులకు తండ్రి. కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో ఆయన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..