IND vs NZ Playing XI: శాంసన్, ఉమ్రాన్‌కు మరోసారి మొండిచేయేనా.. ధావన్ ప్లేయింగ్ XI ఇదేనా?
India vs New Zealand 1st ODI: ఆక్లాండ్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే శుక్రవారం జరగనుంది. శిఖర్ ధావన్ ఎలాంటి ఆటగాళ్లతో బరిలోకి దిగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 1-0తో ఓడించిన తర్వాత వన్డే సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి ఆక్లాండ్‌లో ప్రారంభం కానుంది. సిరీస్ ప్రారంభానికి ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే, భారత ప్లేయింగ్ XI ఏది? సంజూ శాంసన్ , ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆటగాళ్లకు టీ20 సిరీస్‌లో అవకాశం రాలేకపోవడంతో, వన్డే సిరీస్‌లోనోనైనా అవకాశం వస్తుందా? అనే సందేహాలు తీరాల్సి ఉంది. వ్యూహాత్మక కారణాల వల్లే సంజూకు అవకాశం రాలేదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీ20 సిరీస్‌లో పేర్కొన్నాడు. మరి వన్డే సిరీస్‌లో ఎలాంటి జట్టుతో బరిలోకి దిగనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం ఇంకా కష్టంగా ఉంది. ఎందుకంటే భారత జట్టులో మరెందరో ప్లేయర్లుకు వీరికి గట్టి పోటీని ఇస్తున్నారు. మరి ఇలాంటి ప్లేయర్ల మధ్య వీరు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటారా లేదా అనే ఆసక్తి పెరిగిపోతుంది.
శాంసన్-ఉమ్రాన్‌లకు అవకాశం రావడం కష్టమే..
జట్టులో రిషబ్ పంత్ రూపంలో వికెట్ కీపర్ ఉన్నందున సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు అవకాశం లభించడం కష్టం. అదే సమయంలో, దీపక్ హుడా కూడా ఈ జట్టులో ఉన్నాడు, అతను ఆల్ రౌండర్. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నందున ఉమ్రాన్ మాలిక్ కూడా ఆడటం కష్టమే. అలాగే టీ20 ఫార్మాట్‌లో అద్భుతాలు చేసిన అర్ష్‌దీప్ సింగ్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ప్లేయింగ్ ఎలెవన్‌లో టాప్ 6?
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు బరిలోకి దిగడం ఖాయం. శ్రేయాస్ అయ్యర్ గత న్యూజిలాండ్ టూర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి అతని స్థానం ఖాయమైంది. దీంతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడటం ఖాయమంటున్నారు. వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్ వైస్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయనున్నాడు. ఇప్పుడు ఆరో నంబర్ బ్యాట్స్ మెన్ కోసం దీపక్ హుడా, శాంసన్ మధ్య పోరు జరగనుంది. యుటిలిటీ ప్లేయర్ కావడంతో హుడాదే పైచేయిగా నిలుస్తుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తన సత్తా చాటాడు.
బౌలింగ్ బాధ్యత ఎవరికి ఇస్తారు?
బౌలింగ్ గురించి మాట్లాడితే, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ అటాక్‌లో ఆడటం దాదాపు ఖాయం. అటువంటి పరిస్థితిలో ఉమ్రాన్ మాలిక్ బెంచ్ మీద కూర్చోవచ్చు.
తొలి వన్డే కోసం భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..