DC vs CSK 1st Innings Highlights: హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన కాన్వే, గైక్వాడ్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్..

Delhi Capitals vs Chennai Super Kings: చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 224 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.

DC vs CSK 1st Innings Highlights: హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన కాన్వే, గైక్వాడ్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్..
Dc Vs Csk Live Score
Follow us
Venkata Chari

|

Updated on: May 20, 2023 | 5:17 PM

Delhi Capitals vs Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 67వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 224 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.

79 పరుగుల వద్ద రితురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో రిలే రస్సో చేతికి చిక్కి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం శివం దూబే తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 9 బంతుల్లోనే 3 సిక్సులతో 22 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక మూడో వికెట్‌గా డేవాన్ కాన్వే 87 పరుగుల వద్ద అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

అంతకుముందు, కాన్వే ప్రస్తుత సీజన్‌లో 1000వ సిక్స్‌ను కొట్టాడు. వరుసగా రెండో సీజన్‌లోనూ వెయ్యికిపైగా సిక్సర్లు కొట్టారు. గత సీజన్‌లో 1062 సిక్సర్లు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

కాన్వే 33 బంతుల్లో హాఫ్ సెంచరీ..

డెవెన్ కాన్వే ఈ సీజన్‌లో ఆరో అర్థసెంచరీ సాధించాడు. 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్‌లో ఇది 9వ హాఫ్ సెంచరీ.

గైక్వాడ్-కాన్వే సెంచరీ భాగస్వామ్యం..

ఓపెనింగ్ జోడీ రితురాజ్ గైక్వాడ్, దేవెన్ కాన్వే చెన్నైకి శుభారంభం అందించారు. వీరిద్దరి మధ్య సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యం ఉంది. ఈ సీజన్‌లో వీరిద్దరూ నాలుగో సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.

గైక్వాడ్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ..

రితురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో మూడో అర్ధ సెంచరీ చేశాడు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్‌లో ఇది 13వ హాఫ్ సెంచరీ.

ఇరుజట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), రిలీ రోసౌవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?