AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: రెండేళ్లుగా సెంచరీ చేయలేదు.. వివాదాలు పక్కకు పెట్టి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టండి..

ప్రస్తుతం భారత్ క్రికెట్‎లో విరాట్ కోహ్లీ అంశం చర్చనీయాంశంగా మారింది. అతను కెప్టెన్సీ కోల్పోవడం, తర్వాత మీడియా సమావేశంలో వ్యాఖ్యలతో అతను వార్తల్లోకి ఎక్కాడు..

Virat Kohli: రెండేళ్లుగా సెంచరీ చేయలేదు.. వివాదాలు పక్కకు పెట్టి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టండి..
Kohli1
Srinivas Chekkilla
|

Updated on: Dec 23, 2021 | 8:40 PM

Share

ప్రస్తుతం భారత్ క్రికెట్‎లో విరాట్ కోహ్లీ అంశం చర్చనీయాంశంగా మారింది. అతను కెప్టెన్సీ కోల్పోవడం, తర్వాత మీడియా సమావేశంలో వ్యాఖ్యలతో అతను వార్తల్లోకి ఎక్కాడు. విరాట్ కోహ్లీ గురించి పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మాట్లాడారు. భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనవసర వివాదాల్లో చిక్కుకోకుండా తన ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు. “రెండేళ్లుగా విరాట్ సెంచరీ చేయలేదు. కాబట్టి అతను ఆటపై దృష్టి పెట్టాలి. సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలకు వ్యతిరేకంగా మాట్లాడటం. అనిల్ కుంబ్లేతో ఇబ్బంది పడ్డ విరాట్ ఇప్పుడు గంగూలీతో ఇబ్బంది పడ్డాడు. కుంబ్లే, గంగూలీ తమను తాము నిరూపించుకున్నారు. వారు నిజమైన హీరోలు. భారత క్రికెట్‌ను మార్చిన గంగూలీకి విరాట్ వ్యతిరేకంగా మాట్లాడి వివాదాన్ని మరింత పెంచాల్సిన అవసరం లేదు.” అని చెప్పాడు.

పాకిస్తాన్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కనేరియా నాలుగో స్థానంలో ఉన్నాడు. “విరాట్ టెస్టులు, టీ20 లలో పరుగులు సాధించడానికి కష్టపడుతున్నాడు. కెప్టెన్‌గా అతను ICC ట్రోఫీని గెలవలేదు. ప్రతిదీ అతనికి వ్యతిరేకంగా జరుగుతోంది. కాబట్టి వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని నేను భావిస్తున్నాను.” అని అన్నాడు.

రోహిత్ గొప్ప ఆటగాడు

“రోహిత్ శర్మ విషయానికి వస్తే, అతను అద్భుతమైన ఆటగాడు. అతను ఐదు ఐపిఎల్ ట్రోఫీలను గెలుచుకున్నాడు. అతను అద్భుతమైన కెప్టెన్. రాహుల్ ద్రవిడ్‌తో అతని స్నేహబంధం అమోఘం. ద్రవిడ్‌తో విరాట్ కోహ్లీకి ఎక్కువ కాలం సత్సంబంధాలు ఉంటాయని నేను అనుకోను. అనిల్ కుంబ్లేతో కూడా విరాట్‌కు సమస్య వచ్చింది. కుంబ్లే, ద్రవిడ్ ఇద్దరూ దక్షిణ భారతదేశం నుంచి వచ్చారు.” అని పేర్కొన్నాడు.

భారత్‌లో మంచి క్రికెటర్లు ఉన్నారని 61 టెస్టుల అనుభవజ్ఞుడైన కనేరియా అన్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, మయాంక్ అగర్వాల్, ప్రియాక్ పంచల్ కూడా రాణిస్తున్నారని చెప్పారు. రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు రాణించలేకపోతే కేఎస్ భరత్, వృద్ధిమాన్ సాహా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మధ్యలో రాణించకపోయినా జట్టులో స్థానంపై ఎవరైనా సంతృప్తిగా, నమ్మకంగా ఉంటే, వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుందని కనేరియా అన్నాడు.

Read Also.. IND vs SA: బౌలర్లు ఒకే.. బ్యాటర్లు రాణించాలి.. ఆ ఆటగాడు గంటలో ఆటను మార్చగలడు..