SRH Vs MI: పోతారు.. మొత్తం పోతారు.. వైనాట్ 300.? కాటేరమ్మ కొడుకుల పూనకాల జాతరే
25 రోజుల క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు ఓ బోల్డ్ ప్రిడిక్షన్ చేశాడు. ఏప్రిల్ 17న ముంబై, హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఏదో పెద్ద విషయం జరగబోతోందని చెప్పాడు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆ అద్భుత ఘనత చూడబోతున్నామన్నారు.

25 రోజుల క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు ఓ బోల్డ్ ప్రిడిక్షన్ చేశాడు. ఏప్రిల్ 17న ముంబై, హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఏదో పెద్ద విషయం జరగబోతోందని చెప్పాడు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆ అద్భుత ఘనత చూడబోతున్నామన్నారు. మరి ఈ ప్రిడిక్షన్ చేసింది మరెవరో కాదు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్. ఆ ప్రిడిక్షన్ చేసింది మార్చి 23, 2025న.
గత సీజన్ వరకు డేల్ స్టెయిన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, ఈ సీజన్‌లో మాత్రం అతడు వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. కానీ, 25 రోజుల క్రితం, తన మాజీ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025లో SRH 300 పరుగులు కొట్టబోతోందని అన్నాడు. మార్చి 23న తన ట్విట్టర్‌లో ఏప్రిల్ 17న జరిగే మ్యాచ్‌లో SRH 300 పరుగులు కొడుతుందని చెప్పాడు.
ఏప్రిల్ 17న ఏం జరగబోతోంది.? ఏప్రిల్ 17న వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. డేల్ స్టెయిన్ మాటలను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అతడు మద్దతు తెలిపాడు. ఈ జట్టు 300 పరుగులు చేస్తుందని అంచనా వేశాడు. ఏప్రిల్ 17న ఐపీఎల్‌లో వాంఖడే వేదికగా 300 పరుగులు నమోదవుతాయని అన్నాడు. స్టెయిన్ ప్రకారం.. వాంఖడే మైదానం బౌండరీలు చాలా చిన్నవి. పరుగుల వరద పారోచ్చు.
Small prediction. April 17 we’ll see the first 300 in IPL.
Who knows, I might even be there to see it happen.
— Dale Steyn (@DaleSteyn62) March 23, 2025




