HBD Virat Kohli: పుట్టినరోజున మ్యాచ్‌ ఆడితే.. ఓడిపోయేదే లే.. ఈసారి కూడా తగ్గేదేలే అంటోన్న కోహ్లీ రికార్డులు..

Virat Kohli Birthday Match Records: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 2023 ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు మొదటిసారిగా తలపడుతున్నాయి. అయితే, విరాట్ తన పుట్టినరోజున మ్యాచ్ ఆడడం తన కెరీర్‌లో ఇది మూడోసారి. అంటే, ఇంతకు ముందు కూడా విరాట్ కోహ్లీ తన పుట్టినరోజున రెండు మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో టీమ్ ఇండియా ఓడిపోలేదు. అంటే విరాట్ కోహ్లి తన పుట్టినరోజున మ్యాచ్ ఆడితే, ఓడిపోవడం జరగలేదు. నేడు కూడా అదే జరుగుతుందని అంతా భావిస్తున్నారు.

HBD Virat Kohli: పుట్టినరోజున మ్యాచ్‌ ఆడితే.. ఓడిపోయేదే లే.. ఈసారి కూడా తగ్గేదేలే అంటోన్న కోహ్లీ రికార్డులు..
Virat Kohli's Birthday Records
Follow us
Venkata Chari

|

Updated on: Nov 05, 2023 | 11:25 AM

HBD Virat Kohli: 5 నవంబర్. భారత క్రికెట్ చరిత్రలో ఈ తేదీ చాలా ప్రత్యేకమైనది. దీనికి కారణం విరాట్ కోహ్లీ. నవంబర్ 5న ఆయన పుట్టినరోజు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 2023 ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు మొదటిసారిగా తలపడుతున్నాయి. అయితే, విరాట్ తన పుట్టినరోజున మ్యాచ్ ఆడడం తన కెరీర్‌లో ఇది మూడోసారి. అంటే, ఇంతకు ముందు కూడా విరాట్ కోహ్లీ తన పుట్టినరోజున రెండు మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో టీమ్ ఇండియా ఓడిపోలేదు. అంటే విరాట్ కోహ్లి తన పుట్టినరోజున మ్యాచ్ ఆడితే, ఓడిపోవడం జరగలేదు. నేడు కూడా అదే జరుగుతుందని అంతా భావిస్తున్నారు.

ఇప్పుడు ఈ కోణంలో చూస్తే, నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, అది అంత సులభం కాదు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటి వరకు ఎలాంటి క్రికెట్‌ను ప్రదర్శించిందో అందరికీ తెలిసిందే. రెండూ పాయింట్ల పట్టికలో హోరాహోరీగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ముందుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించిన రెండు జట్లుగానూ నిలిచాయి. ఇప్పుడు, విరాట్ కోహ్లీ పుట్టినరోజు చరిత్ర మారుతుందా లేదా పునరావృతం అవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే, ప్రస్తుతానికి, విరాట్ కోహ్లీ తన పుట్టినరోజున ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచ్‌ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ Vs సౌతాఫ్రికా, 5 నవంబర్ 2015..

విరాట్ కోహ్లీ తన పుట్టినరోజున 2015లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడాడు. అది నవంబర్ 5 నుంచి మొహాలీలో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో భారత్ 108 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ ప్రత్యేక ప్రదర్శన చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగు, రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ విశేషమేమిటంటే.. భారత గడ్డపై విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

విరాట్ కోహ్లీ Vs స్కాట్లాండ్, 5 నవంబర్ 2021

విరాట్ కోహ్లీ పుట్టినరోజున, 2021 టీ20 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్‌తో భారత్ రెండవ మ్యాచ్ ఆడింది. 20 ఓవర్లలో 86 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో విశేషమేమిటంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన చివరి సిరీస్ ఇదే.

దక్షిణాఫ్రికా 5 నవంబర్ 2023న..

ఇప్పుడు మరోసారి విరాట్ కోహ్లీ తన పుట్టినరోజున మరో మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈసారి కూడా దక్షిణాఫ్రికాతోనే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదట, విరాట్ తన పుట్టినరోజున మొదటిసారి వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. రెండవది, ఈసారి విరాట్ కోహ్లీ కెప్టెన్ కాదు. అంటే ఆటగాడిగా తొలిసారిగా తన పుట్టినరోజున మ్యాచ్ ఆడుతూ కనిపించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..