
CSK Bowler Mustafizur Rahman record: చెన్నైలో శుక్రవారం జరుగుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ బౌలర్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్‌లోనే ఇలాంటి రికార్డ్ నమోదైంది.
ఎడమచేతి వాటం పేసర్ తన CSK అరంగేట్రంలో నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఇదే కావడం గమనార్హం.
‘ది ఫిజ్’గా ప్రసిద్ధి చెందిన, ఫాస్ట్ బౌలర్ తన మొదటి ఓవర్‌లోనే ప్రత్యర్థి కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను పెవిలియన్ చేర్చాడు. మరో అరంగేట్ర ఆటగాడు రచిన్ రవీంద్ర డీప్‌లో క్యాచ్‌ని పూర్తి చేయడంతో డేంజరస్ ప్లేయర్ ఫాప్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
రజత్ పాటిదార్ వెంటనే మూడు బంతుల్లో డకౌట్ అయ్యాడు. స్టంప్స్ వెనుక ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. ముస్తాఫిజుర్ ఏడు ఓవర్ల తర్వాత తిరిగి వచ్చాడు. రెండు బంతుల వ్యవధిలో విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్‌లను అతని స్లోయర్-బాల్ కట్టర్‌తో ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. దీంతో బెంగళూరు ఇన్నింగ్స్ దారుణంగా పడిపోయింది. అయితే దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో బెంగళూరు జట్టు ఇరవై ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 174 పరుగుల టార్గెట్ నిలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..