AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK: ఆ సీన్ రిపీటైతే.. ఇక చెన్నై టీంను ప్లే ఆఫ్స్ చేరకుండా అడ్డుకోలేరంతే.. అదేంటంటే?

CSK Playoffs 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రసవత్తరంగా మారుతోంది. పంజాబ్ జట్టుపై ముంబై సాధించిన విజయం చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలను మెరుగుపరిచింది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న చెన్నై, మరో హ్యాట్రిక్ నమోదు చేస్తే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకునే సువర్ణావకాశం కనిపిస్తోంది. అభిమానుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

CSK: ఆ సీన్ రిపీటైతే.. ఇక చెన్నై టీంను ప్లే ఆఫ్స్ చేరకుండా అడ్డుకోలేరంతే.. అదేంటంటే?
Csk Playoffs 2026
Venkata Chari
|

Updated on: May 15, 2026 | 4:07 PM

Share

CSK Playoffs 2026: ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో, 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టుకు ఇంకా 3 కీలక పోరాటాలు మిగిలి ఉన్నాయి. ఈ మూడింటిలోనూ విజయం సాధిస్తే 18 పాయింట్లతో ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా నాకౌట్ దశకు చేరుకోవచ్చు. ఒకవేళ రెండింటిలో గెలిస్తే మాత్రం హైదరాబాద్, రాజస్థాన్ వంటి ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. రానున్న మ్యాచ్‌లలో లక్నో, హైదరాబాద్, గుజరాత్ జట్లతో తలపడాల్సి ఉండగా, ఇందులో హైదరాబాద్‌తో మ్యాచ్ మాత్రమే సొంత మైదానమైన చేపాక్‌లో జరగనుంది. మిగిలిన 2 మ్యాచ్‌లు బయట వేదికలపై కావడంతో చెన్నైకి అసలైన సవాలు ఎదురుకానుంది.

చరిత్ర పునరావృతమవుతుంచెన్దానై..?

గతంలోనూ కొన్ని జట్లు ఆరంభంలో తడబడి, చివరి దశలో పుంజుకుని అద్భుతాలు సృష్టించాయి. 2024 సీజన్‌లో బెంగళూరు జట్టు కేవలం ఒకే ఒక్క విజయం తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు 2014లో కోల్‌కతా జట్టు సైతం వరుస విజయాలతో ఏకంగా విజేతగా నిలిచింది. ఇప్పుడు చెన్నై కూడా అదే బాటలో పయనిస్తోంది. వరుసగా మూడు విజయాలు సాధించిన ధీమాతో ఉన్న రుతురాజ్ సేన, మరోసారి హ్యాట్రిక్ నమోదు చేసి ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. చరిత్రలో నిలిచిన ఆ పాత ఫీట్‌ను చెన్నై మళ్ళీ రిపీట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జట్టు బలాలు, కీలక ఆటగాళ్లు..

ప్రస్తుతం చెన్నై జట్టులో సంజు శాంసన్ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. ఉర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్‌లు, శివం దూబే ఫినిషింగ్ సామర్థ్యం ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాయి. బౌలింగ్ విభాగంలో అన్షుల్ కాంబోజ్ ప్రధాన అస్త్రంగా మారాడు. జేమీ ఓవర్టన్ గాయంతో దూరం కావడం కొంత లోటుగా అనిపించినప్పటికీ, మ్యాట్ హెన్రీ, ముకేష్ చౌదరి, అకీల్ హుస్సేన్ వంటి నాణ్యమైన బౌలర్లు జట్టులో ఉన్నారు. వీరంతా సమిష్టిగా రాణిస్తే చెన్నైకి విజయాలు సాధించడం అసాధ్యమేమీ కాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
కామాంధుడికి కఠినశిక్ష విధించిన కోర్టు!
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
పులిహోర పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా? ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిసిన
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే
ఈ యంగ్ స్పిన్నర్‌ని చూస్తే లంక బ్యాటర్లు వణకాల్సిందే