MS Dhoni Clean Bowled: తెలుగోడి బౌలింగ్‌లో ధోని క్లీన్ బౌల్డ్… వైరల్ అవుతున్న వీడియో..
CSK MS Dhoni: ధోని అంటేనే సిక్సర్లకు రారాజు. అతడు క్రీజులో ఉన్నంతసేపు.. బౌలర్లకు చుక్కలే. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఆకాశమే...
CSK MS Dhoni: ధోని అంటేనే సిక్సర్లకు రారాజు. అతడు క్రీజులో ఉన్నంతసేపు.. బౌలర్లకు చుక్కలే. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. అయితే ఈ దిగ్గజ క్రికెటర్‌ను అనుభవం లేని 22 ఏళ్ల బౌలర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఘటన తాజాగా సీఎస్‌కే నెట్ ప్రాక్టిస్ సెషన్‌లో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాస్తవానికి, సీఎస్కే క్యాంప్‌లో బుధవారం ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. సీఎస్కే ఆటగాళ్ల రెండు టీమ్స్‌గా విడిపోయి మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో ధోని అద్బుత అర్ధ సెంచరీ చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు ఉన్నాయి. ప్రతీ బంతిని బౌండరీకి తరలించాడు. సెంచరీకి చేస్తాడనుకునేలోపు.. 13వ ఓవర్‌లో 22 ఏళ్ల యువ బౌలర్ హరిశంకర్ రెడ్డి ధోనిని క్లీన్ బౌల్డ్ చేశాడు.
22 ఏళ్ల హరిశంకర్ రెడ్డి డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు..
ధోనిని క్లీన్ బౌల్డ్ చేసిన బౌలర్ పేరు హరిశంకర్ రెడ్డి. ఈ 22 ఏళ్ల యువ బౌలర్‌ను సీఎస్కే మినీ వేలంలో దక్కించుకుంది. సీఎస్కే క్యాంప్‌లో చేరడానికి ముందు, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో హరిశంకర్ రెడ్డి అద్భుత ఫామ్ కొనసాగించాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆంధ్ర జట్టు తరుపున ఆడిన ఏళ్ల హరిశంకర్ రెడ్డి విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టగా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు.
ఏప్రిల్ 10న సీఎస్కే తొలి మ్యాచ్…
ఏప్రిల్ 9 నుండి ఐపీఎల్ 2021 ప్రారంభమవుతుంది. సీఎస్కే తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 10న వాంఖడే స్టేడియంలో జరగనుంది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 40 ఏళ్ల ధోని, ఈసారి మళ్లీ తన జట్టుకు ట్రోఫీని అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ధోని వికెట్ వీడియో…
Hari Shankar Reddy taking Dhoni’s wicket during the practice#IPL2021 pic.twitter.com/zpEv8gHsp8
— Vinesh Prabhu (@vlp1994) March 17, 2021
మరిన్ని ఇక్కడ చదవండి:
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!