Video: సిక్సర్లతో కోట్లకు పడగలెత్తిన కొడుకు.. ఇప్పటికీ ఇంటింటీకి సిలిండర్లు డెలివరీ చేస్తోన్న తండ్రి..
Rinku Singh Father Viral Video: రింకూ సింగ్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఓ సెన్సేషన్‌గా మారాడు. ప్రస్తుతం ఆయన జీవితం కూడా మారిపోయింది. కానీ, రింకూ మాత్రం ఎంతో సింపుల్‌గా కనిపిస్తుంటాడు. తన తండ్రి నుంచి గొప్ప విలువలను వారసత్వంగా పొందాడని చాలా మంది అంటుంటారు. తండ్రిలానే కొడుకు కూడా ఉంటాడని చెబుతున్నారు.

Rinku Singh Father Viral Video: ఏ క్రికెటర్ జీవితం చూసినా.. ఎంతో గొప్పగా ఉంటుంది. అతని కుటుంబ సభ్యుల జీవితం కూడా దాదాపు అదే విధంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్లకు పడగలు ఎత్తిన తర్వాత.. వారి జీవితాలతోపాటు, వారి నడవడికల్లోనూ భారీగా మార్పులు వస్తుంటాయి. అయితే, ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నా.. తమ పూర్వ పరాలను మరచిపోని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇలాంటి జాబితాలా చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. ఇలాంటి కోవలోకే క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబం కూడా వస్తోంది.
రింకూ సింగ్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఓ సెన్సేషన్‌గా మారాడు. ప్రస్తుతం ఆయన జీవితం కూడా మారిపోయింది. కానీ, రింకూ మాత్రం ఎంతో సింపుల్‌గా కనిపిస్తుంటాడు. తన తండ్రి నుంచి గొప్ప విలువలను వారసత్వంగా పొందాడని చాలా మంది అంటుంటారు. తండ్రి లానే కొడుకు కూడా ఉంటాడని చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి.. సరిగ్గా సరిపోతారు అంటున్నారు. రింకూ క్రికెట్ ఆటలో కోట్ల రూపాయలు సంపాదించడం ప్రారంభించినా.. తండ్రి ఖాంచంద్ సింగ్ మాత్రం తన పాత రోజులను ఇంకా మర్చిపోలేదు. నేటికీ ప్రజల ఇళ్లకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దుష్యంత్భరద్వాజ్ 50986 ద్వారా ఒక వీడియో అప్ లోడ్ చేశారు. రింకూ సింగ్ తండ్రి సింప్లిసిటీకి ఉదాహరణగా నిలిచాడంటూ క్యాప్షన్ అందించాడు. రింకు సింగ్ తండ్రి ఇప్పటికీ గ్యాస్ సిలిండర్ డెలివరీ వాహనాన్ని నడుపుతున్నాడు. అతను స్వయంగా సిలిండర్లను ఇంటింటికీ డెలివరీ చేస్తున్నాడని అందులో తెలిపాడు. ఖంచంద్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను తన ఆటోలో సిలిండర్‌ను లోడ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
ప్రజల హృదయాలను తాకిన సింప్లిసిటీ..
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయినప్పటి నుంచి వేలాది మంది దీనిని వీక్షించారు. రింకూ సింగ్ తండ్రి సింప్లిసిటీ చాలా మందికి నచ్చింది. ఒక వినియోగదారు ఈ పోస్ట్‌పై ‘హృదయాన్ని హత్తుకునే వీడియో’ అంటూ కామెంట్ చేశాడు.
తక్కువ సమయంలోనే తన ఆటతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో రింకూ సింగ్ తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. భారత జట్టులో చేరిన తర్వాత, అతనిపై డబ్బుల వర్షం మొదలైంది. అయినప్పటికీ అతని తండ్రి తన పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




