AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంజీలో ఇరగదీస్తోన్న డైరెక్టర్ కొడుకు.. తొలి 4 మ్యాచ్‌ల్లోనే 5 సెంచరీలు.. రికార్డులతో బౌలర్ల బెండ్ తీసేస్తున్నాడుగా

Ranji Trophy Records: ప్రఖ్యాత సినీ దర్శకుడు విధు వినోద్ చోప్రా, సినీ విమర్శకురాలు అనుపమ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా తన తొలి సీజన్ రంజీ ట్రోఫీలో బ్యాట్‌తో సంచలన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లలో ఓ స్పెషల్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు.

రంజీలో ఇరగదీస్తోన్న డైరెక్టర్ కొడుకు.. తొలి 4 మ్యాచ్‌ల్లోనే 5 సెంచరీలు.. రికార్డులతో బౌలర్ల బెండ్ తీసేస్తున్నాడుగా
Agni Chopra
Venkata Chari
|

Updated on: Feb 01, 2024 | 10:56 AM

Share

Agni Chopra created history: క్రికెట్ ఆటలో రికార్డులు పుడుతూనే ఉంటాయి. అవి బద్దలవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని మాత్రం అలాగే, ఉంటాయి. ప్రతీ క్రికెటర్ కూడా ఈ పుస్తకంలో తన పేరు ఉండాలని కోరుకుంటాడు. అయితే, తాజాగా ఓ యువ ప్లేయర్.. ఇప్పటి వరకు పుస్తకంలో లేని ఓ రికార్డ్‌ను తన పేరుతో లిఖించుకున్నాడు. ఆ ప్లేయర్ తండ్రి ఓ డైరెక్టర్ కావడం మరో విశేషం. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు, ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆ యువ ప్లేయర్ పేరు అగ్ని చోప్రా. 12వ ఫెయిల్ దర్శకుడు విధు వినోద్ చోప్రా, సినీ విమర్శకురాలు అనుపమ చోప్రా కుమారుడు. రంజీ ట్రోఫీలో తన తొలి సీజన్‌లో బ్యాట్‌తో సంచలన ఫామ్‌తో దూసుకపోతున్నాడు. 25 ఏళ్ల బ్యాట్స్‌మన్ మిజోరం తరపున ఆడుతున్నాడు. ఇక తన మొదటి సీజన్‌లో వరుసగా 5 సెంచరీలు సాధించడం ద్వారా రంజీ ట్రోఫీలో రికార్డును సృష్టించాడు. అగ్ని ప్రపంచ రికార్డు గురించి అనుపమ చోప్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్‌తో కూడిన క్యాప్షన్‌లో, ఆమె ‘ప్రౌడ్ మామ్’ అంటూ రాసుకొచ్చింది.

మేఘాలయతో జరిగిన తన నాల్గవ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో మేఘాలయపై అగ్ని సెంచరీ సాధించాడు. కేవలం 90 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను తన బ్యాట్‌తో 13 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శన మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో 359 పరుగుల బలమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అగ్ని తన కెరీర్‌లో ఇప్పటివరకు 4 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో, అతను 8 ఇన్నింగ్స్‌లలో 95.87 సగటు, 111.80 స్ట్రైక్ రేట్‌తో 767 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్‌లో అతని పేరిట 5 సెంచరీలతో పాటు 1 హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ సమయంలో అతను 101 ఫోర్లు, 19 సిక్సర్లు కూడా కొట్టాడు.

4 మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్..

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొదటి 4 మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా అగ్ని చోప్రా నిలిచాడు. సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను 166, 92 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆ తర్వాత నాగాలాండ్‌పై 166, 15 పరుగులు చేయగా, అరుణాచల్ ప్రదేశ్‌పై 114, 10 పరుగులు చేశాడు. తాజాగా మేఘాలయపై తొలి ఇన్నింగ్స్‌లో 90 బంతుల్లో 105 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో 101 పరుగులు చేశాడు. బలహీన జట్లపై అగ్ని ఈ పరుగులను సాధించాడని కొందరు క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, అతని ఇన్నింగ్స్‌లో నిలకడ, నైపుణ్యం కనిపించాయి.

ఇతర ఫార్మాట్లలో అగ్ని ప్రదర్శన..

ఇతర ఫార్మాట్లలో అగ్ని ప్రదర్శన గురించి మాట్లాడితే, అతను ఇప్పటివరకు 7 లిస్ట్ A మ్యాచ్‌లలో 1 అర్ధ సెంచరీ సహాయంతో 174 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని సగటు 24.85; స్ట్రైక్ రేట్ 65.90లుగా నిలిచింది. ఇది కాకుండా, 7 T-20 మ్యాచ్‌లలో అతను 33.42 సగటు, 150.96 స్ట్రైక్ రేట్‌తో 234 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని పేరు మీద 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 94 పరుగులు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..