కష్టాల్లో సౌతాఫ్రికా.. ఆదుకున్న వరుణుడు!

ప్రపంచకప్ మ్యాచ్‌లకు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాడు. తాజాగా సౌథాంప్టన్ వేదికగా విండీస్, సఫారీల మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారింది. అయితే ఇది సఫారీ జట్టుకు కొంచెం ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. మ్యాచ్ ఆరంభమైన 7 ఓవర్ల తర్వాత అకస్మాత్తుగా చిరుజల్లులు రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఇది ఇలా ఉండగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 7.3 ఓవర్లలో రెండు […]

కష్టాల్లో సౌతాఫ్రికా.. ఆదుకున్న వరుణుడు!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 10, 2019 | 4:41 PM

ప్రపంచకప్ మ్యాచ్‌లకు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాడు. తాజాగా సౌథాంప్టన్ వేదికగా విండీస్, సఫారీల మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారింది. అయితే ఇది సఫారీ జట్టుకు కొంచెం ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. మ్యాచ్ ఆరంభమైన 7 ఓవర్ల తర్వాత అకస్మాత్తుగా చిరుజల్లులు రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.

ఇది ఇలా ఉండగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 7.3 ఓవర్లలో రెండు వికెట్లకు 29 రన్స్ చేసింది. షార్ట్ బాల్స్‌తో మరోసారి కరీబియన్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు. ప్రస్తుతం డికాక్(17), డుప్లెసిస్(0) క్రీజులో ఉన్నారు