టీమిండియాకు షాక్.. ధావన్‌కు తగ్గని గాయం

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను గాయం వెంటాడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో గాయపడ్డ శిఖర్‌ను వైద్యులు పరీక్షించారు. అతడి బొటనవేలుకు ఇవాళ స్కానింగ్ చేయనున్నారు. ముందు జాగ్రత్తగా శిఖర్‌కు వైద్య పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ కీలక పాత్ర పోషించాడు. 109 బంతుల్లో 117 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాట వేశాడు. మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ వేసిన బంతి ధావన్ చేతికి బలంగా తగిలింది. దీంతో అతడి […]

టీమిండియాకు షాక్.. ధావన్‌కు తగ్గని గాయం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 11, 2019 | 9:41 AM

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను గాయం వెంటాడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో గాయపడ్డ శిఖర్‌ను వైద్యులు పరీక్షించారు. అతడి బొటనవేలుకు ఇవాళ స్కానింగ్ చేయనున్నారు. ముందు జాగ్రత్తగా శిఖర్‌కు వైద్య పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ కీలక పాత్ర పోషించాడు. 109 బంతుల్లో 117 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాట వేశాడు. మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ వేసిన బంతి ధావన్ చేతికి బలంగా తగిలింది. దీంతో అతడి వేలు వాచింది. నొప్పి వల్ల ఆసీస్ మ్యాచ్‌లో శిఖర్ ఫీల్డింగ్ చేయలేదు.

ప్రస్తుతం శిఖర్‌కు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బొటనవేలికి ఇవాళ స్కానింగ్ చేయనున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా రేపు న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆడాలా.. వద్దా అన్న నిర్ణయానికి వస్తాడని తెలుస్తోంది. త్వరగా వాపు తగ్గి గబ్బర్ బరిలోకి దిగాలని టీమ్‌తో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.