మా వాళ్ల తరుపున సారీ స్మిత్- కోహ్లి

వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గతంలో స్టీవ్ స్మిత్ చేసిన బాల్ ట్యాంపరింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత అభిమానులు చీటర్.. చీటర్.. అంటూ మ్యాచ్‌లో అతడ్ని టీజ్ చేశారు. కాస్త హద్దుమీరి ప్రవర్తించారు. దాన్ని గమనించిన కోహ్లీ.. అలా ప్రవర్తించవద్దంటూ భారత అభిమానులను మందలించాడు. చప్పట్లు కొట్టి అతడ్ని ప్రోత్సహించాలని సైగ చేశాడు. అటుగా వచ్చిన స్మిత్‌తో.. అభిమానుల తరఫున క్షమించు అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో […]

మా వాళ్ల తరుపున సారీ స్మిత్- కోహ్లి
Follow us

|

Updated on: Jun 10, 2019 | 3:53 PM

వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గతంలో స్టీవ్ స్మిత్ చేసిన బాల్ ట్యాంపరింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత అభిమానులు చీటర్.. చీటర్.. అంటూ మ్యాచ్‌లో అతడ్ని టీజ్ చేశారు. కాస్త హద్దుమీరి ప్రవర్తించారు. దాన్ని గమనించిన కోహ్లీ.. అలా ప్రవర్తించవద్దంటూ భారత అభిమానులను మందలించాడు. చప్పట్లు కొట్టి అతడ్ని ప్రోత్సహించాలని సైగ చేశాడు. అటుగా వచ్చిన స్మిత్‌తో.. అభిమానుల తరఫున క్షమించు అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘జరిగిందేదో జరిగిపోయింది. అతను రీ ఎంట్రీ చేశాడు. ఐపీఎల్‌లో సైతం స్మిత్‌ను ఇలా గేలి చేయడం చూశా. ఒకరిని కించపరస్తూ ఇలా గేలిచేయడం అంత మంచిది కాదు. మా అభిమానుల తరఫున మైదానంలోనే అతన్ని క్షమాపణలు కోరాను’ అని కోహ్లి చెప్పాడు. కాగా, అభిమానులను కోహ్లి మందలించడాన్ని చూసిన స్మిత్‌.. అభినందన పూర్వకంగా అతనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, భుజం తట్టాడు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..