జంపా..జేబులో ఏముందోయ్?
ఏడాది కిందట బాల్‌టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఇకపై ఆ జట్టు ఆటగాళ్లెవరైనా టాంపరింగ్ గురించి ఆలోచన అయినా చేస్తారని అనుకోలేం. ఐతే ఆదివారం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన ప్రవర్తనతో టాంపరింగ్ సందేహాలు రేకెత్తించాడు. తన తొలి స్పెల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం, తర్వాత బంతిని రుద్దడమే ఈ సందేహాలకు కారణం. ఈ దృశ్యాలు […]
ఏడాది కిందట బాల్‌టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఇకపై ఆ జట్టు ఆటగాళ్లెవరైనా టాంపరింగ్ గురించి ఆలోచన అయినా చేస్తారని అనుకోలేం. ఐతే ఆదివారం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన ప్రవర్తనతో టాంపరింగ్ సందేహాలు రేకెత్తించాడు. తన తొలి స్పెల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం, తర్వాత బంతిని రుద్దడమే ఈ సందేహాలకు కారణం. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో భారీగా హల్‌చల్ చేశాయి. జంపా తీరు అనుమానాస్పదంగా ఉందని, దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే జంపా కచ్చితంగా టాంపరింగ్‌కు పాల్పడ్డాడని చెప్పేలా ఆ దృశ్యాలు లేవు.