ODI World Cup 2023: భారత్ ఆడాల్సిన 2 వార్మప్ మ్యాచ్‌లు రద్దు.. ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి.. ఫ్యాన్స్ రియాక్షనిదే..

ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌ నేపథ్యంలో ముందుంగా నిర్వహించిన వార్మప్ మ్యాచ్‌లు కూడా ముగిశాయి. ఇక టోర్నీ ప్రారంభానికి ఒక్క రోజే సమయం మిగిలి ఉంది. డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే రేపటి మ్యాచ్ ద్వారా వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. అయితే మెగా టోర్నీకి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌ల విషయంలో టీమిండియా ఫ్యాన్స్ ఏ మాత్రం సంతోషంగా..

ODI World Cup 2023: భారత్ ఆడాల్సిన 2 వార్మప్ మ్యాచ్‌లు రద్దు.. ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి.. ఫ్యాన్స్ రియాక్షనిదే..
World Cup 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Oct 04, 2023 | 7:31 AM

ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌ నేపథ్యంలో ముందుంగా నిర్వహించిన వార్మప్ మ్యాచ్‌లు కూడా ముగిశాయి. ఇక టోర్నీ ప్రారంభానికి ఒక్క రోజే సమయం మిగిలి ఉంది. డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే రేపటి మ్యాచ్ ద్వారా వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. అయితే మెగా టోర్నీకి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌ల విషయంలో టీమిండియా ఫ్యాన్స్ ఏ మాత్రం సంతోషంగా లేరు. గువహతిలో ఇంగ్లాండ్‌తో, తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడాల్సిన రెండు వార్మప్ మ్యాచ్‌లూ వర్షం కారణంగా రద్దయ్యాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. ఈ వార్మప్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటే ఒక్క బంతి కూడా ఆడకుండా నేరుగా మెగా టోర్నీ బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటివారికి టోర్నీకి ముందు సరైన ప్రాక్టీస్ లేదు. దీంతో అభిమానులు కలత చెందుతున్నారు. ఈ మేరకు తమ స్పందనలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

ఇంతకంటే ఏం చేయగలం..? 

నో..? 

రోహిత్, కోహ్లీకి కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సింది కదా..

అన్నీ వర్షం నీడలోనే..

ఇంక చాలు..!

వర్షం చూడడానికేనా 6115 కి.మీ ప్రయాణం..

ఉన్న ఉత్సాహం కూడా పోతుందిగా ఇలా అయితే..

సరిపోయిందిగా..

కాగా, రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్  కప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడుతుంది. చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లు కూడా తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.

2023 లెక్కలు తేల్చుకునే సమయం..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..