AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తుఫాన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ.. ఒకే ఓవర్‌లో 22 పరుగులు.. పుజారా నాటు కొట్టుడు.. వైరల్ వీడియో

Cheteshwar Pujara: చెతేశ్వర్ పుజారా గత కొన్ని వారాలుగా ఇంగ్లండ్‌లో ఉంటున్నాడు. అక్కడ అతను సస్సెక్స్ కౌంటీ క్లబ్ కోసం రాయల్ లండన్ వన్ డే కప్‌లో పాల్గొంటున్నాడు. జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.

Watch Video: తుఫాన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ.. ఒకే ఓవర్‌లో 22 పరుగులు.. పుజారా నాటు కొట్టుడు.. వైరల్ వీడియో
Royal London One Day Cup
Venkata Chari
|

Updated on: Aug 13, 2022 | 7:55 AM

Share

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ చెతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి అతని బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. కొన్ని వారాల క్రితం వరకు అతను కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఒక సెంచరీ, డబుల్ సెంచరీ కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని నుంచి అలాంటి ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు. కానీ, ఇప్పుడు భారత సీనియర్ బ్యాట్స్‌మెన్.. ప్రస్తుతం తన బ్యాటింగ్‌లో ఐదవ గేర్ చూపిస్తున్నారు. ఇంగ్లండ్ రాయల్ లండన్ వన్డే కప్‌లో పుజారా తన బ్యాట్‌తో సెంచరీ సాధించాడు.

పుజారా ఈ ఏడాది మార్చి నుంచి ససెక్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ కౌంటీ కోసం, అతను ఫస్ట్ క్లాస్ ఛాంపియన్‌షిప్‌లో డబుల్ సెంచరీ, సెంచరీలు చేశాడు. ఈ రోజుల్లో అతను అదే కౌంటీ జట్టు కోసం ODI టోర్నమెంట్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఇక్కడ కూడా అతని బ్యాట్‌ను నిశ్శబ్దంగా ఉంచడం బౌలర్ల వల్ల కావడం లేదు. ఇప్పటికే హాఫ్ సెంచరీ చేసిన పుజారా.. తాజాగా ఓ సెంచరీ కూడా చేశాడు.

ఇవి కూడా చదవండి

హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి కేవలం 22 బంతుల్లోనే..

సస్సెక్స్‌కు ఈ టోర్నమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా శుక్రవారం ఆగస్టు 12న వార్విక్‌షైర్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ నాలుగో స్థానంలో దిగడం ద్వారా వార్విక్‌షైర్ బౌలర్లను చిత్తు చేశాడు. ఈ క్రమంలో పుజారా 51 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసినా.. ఆ తర్వాత పూర్తిగా చెలరేగిపోయాడు.

మొదట, పుజారా 45వ ఓవర్‌లో లియామ్ నార్వెల్‌పై 3 ఫోర్లు, ఒక సిక్స్ సహా 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత కేవలం 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అంటే అర్ధ సెంచరీ నుంచి సెంచరీ వరకు పుజారా కేవలం 22 బంతులే ఆడాడు.

పుజారా బలమైన ఇన్నింగ్స్ ఆడినా.. జట్టు ఓడిపోయింది..

ఈ వన్డే టోర్నీలో పుజారాకు ఇదే తొలి సెంచరీ. పుజారా ఇన్నింగ్స్‌తో ససెక్స్ విజయానికి చేరువైంది. అయితే 47వ ఓవర్లో 107 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ సమయంలో, పుజారా కేవలం 7 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అయితే 135 స్ట్రైక్ రేట్ వద్ద కేవలం 79 బంతుల్లో ఈ పరుగులు చేశాడు. అయినప్పటికీ, ససెక్స్ గెలవలేదు. జట్టుకు 311 పరుగుల లక్ష్యం ఉంది. పుజారా 296 పరుగుల వద్ద 7వ వికెట్‌గా ఔటయ్యాడు. అయితే చివరి బ్యాట్స్‌మెన్ మిగిలిన పరుగులు చేయలేకపోయాడు. ససెక్స్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.