Independence Day 2022: స్వాతంత్ర్యం తర్వాత రూటు మార్చిన భారత క్రికెట్.. కీలక సంఘటనలు ఇవే..!
Indian Cricket Team: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత క్రికెట్ ఎన్నో విజయాలు సాధించింది. ప్రస్తుతం భారత జట్టు క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది.
Independence Day 2022: 1947 ఆగస్టు 15 వరకు భారతదేశం పూర్తి స్వాతంత్ర్యం పొందే వరకు బ్రిటన్ మనల్ని పాలించింది. బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పాలించారు. భారతదేశం, బ్రిటన్ రెండింటికీ ఒక ఉమ్మడి విషయంలో సారూప్యత ఉంది. అది క్రికెట్. స్వాతంత్ర్యానికి ముందు, భారతదేశంలో క్రికెట్ ఆధిపత్యం ఉంది. ఇప్పటి కూడా క్రికెట్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర్యానికి ముందు, మహారాజా రంజిత్ సింగ్ 1895-1902 వరకు ఇంగ్లాండ్ తరపున క్రికెట్ ఆడాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత క్రికెట్‌లో సాధించిన గొప్ప విజయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
తొలి విజయం..
1952లో ఇంగ్లండ్‌పై భారత జట్టు తొలి టెస్టు మ్యాచ్ విజయాన్ని అందుకుంది. ఈ జట్టుకు విజయ్ హజారే నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్‌లో వినూ మన్కడ్ 12 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విదేశీ గడ్డపై తొలి టెస్టు విజయం..
యంగ్ టైగర్ పటౌడీ సారథ్యంలో న్యూజిలాండ్‌లో విదేశీ గడ్డపై భారత్ తొలి విజయాన్ని అందుకుంది. 1968లో భారత్ ఈ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
విదేశీ గడ్డపై మొదటి సిరీస్ విజయం..
న్యూజిలాండ్‌ను ఓడించిన రెండు సంవత్సరాల తర్వాత, మెన్ ఇన్ బ్లూ 1970-71 వెస్టిండీస్ పర్యటనలో విదేశీ గడ్డపై మొదటి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. అక్కడ టీమిండిచా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. ఈ సిరీస్‌లోనే, వెస్టిండీస్‌పై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు.
1983 లో గర్వించే విజయం..
9 జూన్ నుంచి 25 జూన్ 1983 వరకు జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ మూడవ ఎడిషన్ జరిగింది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ ఎవరూ కలలో కూడా ఊహించని ఛరిష్మా సాధించింది. ఈ వరల్డ్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ డేంజరస్ వెస్టిండీస్‌ను భారత్ ఓడించి ప్రపంచకప్ గెలుచుకుంది. భారతదేశం ప్రపంచకప్ విజయం తర్వాత, మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని శాసించడం ప్రారంభించింది. అప్పటి నుంచి భారత్‌కు ఎందరో గొప్ప క్రికెటర్లు లభించారు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో, ప్రపంచకప్‌లో విజయం సాధించిన రెండేళ్ల తర్వాత, భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇక్కడ భారత్ తన అతిపెద్ద ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఫైనల్లో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా రవిశాస్త్రికి దక్కింది. ఈ సిరీస్‌లో రవిశాస్త్రి 182 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు.
సచిన్ టెండూల్కర్ అరంగేట్రంతో మారిన రూపురేఖలు..
క్రికెట్ దేవుడుగా పిలిచే సచిన్ టెండూల్కర్ తన 16 సంవత్సరాల వయస్సులో 15 నవంబర్ 1989న కరాచీలో పాకిస్థాన్‌తో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను తన 24 ఏళ్ల కెరీర్‌లో వంద అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ODIలో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్, టెస్టులు, ODIలు రెండింటిలోనూ అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 30 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు సచిన్ నిలిచాడు.
నాట్‌వెస్ట్ సిరీస్ విజయంతో సంబరాలు..
2002 ఇంగ్లాండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్‌లో గంగూలీ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. ఈ సమయంలో సౌరవ్ గంగూలీ భారత్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ విజయాన్ని ఆయన ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం సాధించినందుకు టీ షర్ట్ తీసి ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు.
2003 ప్రపంచ కప్ ఫైనల్..
భారతదేశానికి, 2003 ప్రపంచ కప్ కూడా చాలా కలిసొచ్చింది. ఈ సమయంలో భారత కెప్టెన్సీ సౌరవ్ గంగూలీ చేతిలో ఉంది. ఈ ప్రపంచకప్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
2007 టీ20 ప్రపంచకప్ విజేత..
2007 భారత్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ఏడాది భారత్ తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 2007లో మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
2009లో టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలిచిన భారత్..
2009లో తొలిసారిగా టెస్టుల్లో నంబర్ వన్‌గా రికార్డు సృష్టించి పెద్ద విజయాన్ని సాధించింది. ప్రపంచ క్రికెట్‌లో భారత్ టెస్టుల్లో నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి.
మూడుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్..
2000 తర్వాత 2008, 2012, 2018లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అదే సమయంలో 2006, 2016, 2020 సంవత్సరాల్లో భారత జట్టు ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.
2011 ప్రపంచకప్ విజయం..
2011 సంవత్సరం భారత్‌కు చాలా ప్రత్యేకమైనది. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది భారత్ మళ్లీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆడుతున్న భారత జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి ప్రపంచకప్ గెలుచుకుంది. ఇది సచిన్ టెండూల్కర్ చివరి ప్రపంచకప్.
గబ్బాలో ఆస్ట్రేలియాపై గన విజయం..
32 ఏళ్ల తర్వాత గబ్బా మైదానంలో భారత జట్టు 2021లో భారత జట్టు చేతిలో ఓడిపోయింది. అంతకుముందు 1989లో ఆస్ట్రేలియా జట్టు ఇదే మైదానంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ విజయంతో భారత్ 2-1తో ఆస్ట్రేలియాను సిరీస్‌లో ఓడించింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భారత్ అద్భుతమైన ఆటను కనబరిచింది. అయితే ఫైనల్‌లో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి న్యూజిలాండ్ టైటిల్ గెలుచుకుంది.
ఇవి కాకుండా, భారత జట్టు 2007 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20, 2007-08 CB సిరీస్, 2010, 2016 ఆసియా కప్‌లు, 2011 ICC క్రికెట్ ప్రపంచ కప్, 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.